MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రేంజ్ రోవర్ నుంచి లంబోర్ఘిని ఉరుస్ వ‌ర‌కు.. రోహిత్ శర్మ కార్ కలెక్షన్ ఇదే

రేంజ్ రోవర్ నుంచి లంబోర్ఘిని ఉరుస్ వ‌ర‌కు.. రోహిత్ శర్మ కార్ కలెక్షన్ ఇదే

Rohit Sharma’s car collection: గతేడాది నవంబర్‌లో జరిగిన వన్డే అంతర్జాతీయ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోవడం నుండి ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ గెల‌వ‌డం వ‌ర‌కు భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ప్ర‌యాణం సాగించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు అతను తన కెప్టెన్సీని వదులుకోవలసి వచ్చినప్పటికీ, ఐదుసార్లు టైటిల్ ను అందించి విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా ఉన్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 07 2024, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rohit Sharma, Rohit Sharma car collection

Rohit Sharma, Rohit Sharma car collection

ఐపీఎల్ తో పాటు అంత‌ర్జాతీయ క్రికెట్ లో ట్రోఫీలు గెలిచిన హిట్ మ్యాన్ ఇప్పుడు త‌న జీవితంలో అత్య‌ద్బుత‌మైన క్ష‌ణాల‌ను గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎస్యూవీ అభిమాని అయిన రోహిత్ శ‌ర్మ త‌న కార్ల గ్యారేజీలోకి తాజాగా సెడాన్ ను తీసుకువ‌చ్చాడు. రోహిత్ శ‌ర్మ గ్యారేజీలో ఉన్న కార్ల క‌లెక్ష‌న్ గ‌మ‌నిస్తే..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్

హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ గ్యారేజీలోకి కొత్త‌గా వ‌చ్చి చేరింది ఈ ల‌గ్జ‌రీ మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ కారు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ లగ్జరీ సెడాన్‌లలో ఒక‌టి. ప్రస్తుతం జర్మన్ కంపెనీ ఎస్ క్లాస్ లోS350d, S450 వెర్ష‌న్ల‌ను అందిస్తోంది. రోహిత్ శ‌ర్మ కార్ గ్యారేజీలో మెర్సిడెజ్ S350d ఉంది. ఇది 6.4 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 250 kmph.

35
rolls royce cullinan and lamborghini Urus

rolls royce cullinan and lamborghini Urus

లంబోర్ఘిని ఉరుస్

రోహిత్ శర్మ కార్ గ్యారేజీలో ఉన్న మ‌రో ల‌గ్జ‌రీ కారు లంబోర్ఘిని ఉరుస్. ఈ పవర్-ప్యాక్డ్ లంబోర్ఘిని SUV స్పోర్ట్స్ ప్రత్యేక 0264 నంబర్ క్రింద రిజిస్ట‌ర్ చేశారు. నవంబరు 2014లో శ్రీలంకపై వన్డే ఇంటర్నేషనల్‌లో శర్మ సాధించిన అత్యధిక స్కోరు (264 ప‌రుగులు) ఇదే. ఇదే కారుపై హిట్‌మ్యాన్ ఇటీవల ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో అతివేగంతో డ్రైవ్ చేసి చలాన్ అందుకున్నందుకు వార్తల్లో నిలిచాడు.ఈ AWD SUV 3.5 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 305 kmph.

45

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 

భారత క్రికెట్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, సూర్యకుమార్ యాదవ్ లు మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఎస్ ను కొనుగోలు చేశారు. ప్ర‌స్తుతం రెండు వేరియంట్ల‌లో ఈ ల‌గ్జ‌రీ కార్లు అందుబాటులో ఉన్నాయి. GLS 450 పెట్రోల్ తో న‌డిచే వేరియంట్ రోహిత్ గ్యారేజీలో ఉంది. 

55

రేంజ్ రోవర్

రేంజ్ రోవర్ లేకుండా ఏ సెలబ్రిటీ కారు గ్యారేజ్ పూర్తి కాదు. రోహిత్ శ‌ర్మ కార్ క‌లెక్ష‌న్ లో కూడా ల‌గ్జ‌రీ రేంజ్ రోవ‌ర్ HSE LWB ట్రిమ్ ఉంది. డీజిల్ తో న‌డిచే ఈ SUV గరిష్టంగా 234 kmph వేగంతో 6.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
రోహిత్ శర్మ
క్రీడలు
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved