నీ బ్యాటింగ్‌కి, నీ కెప్టెన్సీకి, నువ్వు సెట్ చేసిన ఫీల్డింగ్‌కి... ఫిదా అయిపోయా! - రోహిత్‌పై షోయబ్ అక్తర్
2011 వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు కూడా దక్కించుకోలేకపోయాడు రోహిత్ శర్మ. అయితే 12 ఏళ్ల తర్వాత 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టును నడిపించే బాధ్యత రోహిత్‌పైన పడింది..
2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన భారత జట్టు, 2023 సెమీ ఫైనల్‌లో అదే న్యూజిలాండ్‌ని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది...
2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఒక్కో పరుగు చేసి అవుట్ అయ్యారు... ఈసారి టాపార్డర్ చెలరేగిపోయింది..
విరాట్ కోహ్లీ 117 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 105 పరుగులు చేసి సెంచరీలు చేసుకోగా రోహిత్ శర్మ 47, శుబ్‌మన్ గిల్ 80, కెఎల్ రాహుల్ 39 పరుగులు చేశారు...
Rohit Sharma
‘భారత జట్టు, న్యూజిలాండ్‌ని చిత్తుగా ఓడించింది. రోహిత్ శర్మ... న్యూజిలాండ్ టాప్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్ మళ్లీ మళ్లీ అదే తప్పులు చేశారు..
Rohit Sharma
రోహిత్ కావాలనుకుంటే ఈ వరల్డ్ కప్‌లో కొన్ని సెంచరీలు చేసుకునేవాడు. లేదా సెమీ ఫైనల్‌లో హాఫ్ సెంచరీ అయినా చేసేవాడు. అతనికి అది పెద్ద విషయం కాదు...
Rohit Sharma
అయితే భారత జట్టు సక్సెస్‌కి రోహిత్ శర్మయే కారణం. ప్లేయర్‌గా, బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లను పొట్టు పొట్టు కొట్టి వదిలిపెట్టాడు...
Rohit Sharma
రోహిత్ పవర్ ప్లేలో చేసిన బ్యాటింగ్ వల్ల మిగిలిన బ్యాటర్లకు బ్యాటింగ్ తేలికైపోతోంది. ఫీల్డ్ సెట్టింగ్ మామూలుగా లేదు. కివీస్ ఈ టార్గెట్‌ని సునాయాసంగా చేధించేలా కనిపించింది. కేవలం రోహిత్ ఫీల్డ్ సెట్టింగ్స్ వల్లే టీమిండియా గెలిచింది..
Rohit Sharma
ప్రత్యర్థి బౌలర్లపై తీవ్రమైన ప్రెషర్ పెంచుతున్నాడు. ఆ తర్వాత మిగిలిన బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేస్తున్నారు..
Rohit Sharma
విరాట్ కోహ్లీ గురించి ఎంతని చెప్పాలి. అతను మాస్టర్ రికార్డులను తుడిచి పెట్టేస్తున్నాడు. సెంచరీ తర్వాత సచిన్‌కి అతను చేసిన అభివాదం, విరాట్ కోహ్లీపై నాకున్న అభిమానాన్ని మరింత పెంచింది..’ అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్..