- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మకు ఇదే మొదటి, ఆఖరి వరల్డ్ కప్! గెలిచి, రిటైర్ అవుతాడు.. సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు..
రోహిత్ శర్మకు ఇదే మొదటి, ఆఖరి వరల్డ్ కప్! గెలిచి, రిటైర్ అవుతాడు.. సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు..
2007 టీ20 వరల్డ్ కప్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, 2023 వన్డే వరల్డ్ కప్‌కి కెప్టెన్సీ చేయబోతున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్, 2015, 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడినా టైటిల్ దక్కించుకోలేకపోయాడు..

2007 టీ20 వరల్డ్ కప్‌తో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో రోహిత్ శర్మ కెరీర్‌లో కూడా రెండు ఐసీసీ టైటిల్స్ ఉన్నాయి. అయితే వన్డే వరల్డ్ కప్ గెలవలేకపోయాననే లోటుని తీర్చుకోవడానికి రోహిత్‌కి ఇదే ఆఖరి అవకాశం..
‘కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే మొదటి వన్డే వరల్డ్ కప్. ఇదే ఆఖరి వరల్డ్ కప్ కూడా. నాలుగేళ్ల తర్వాత జరిగే వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడడం అసాధ్యం. టీ20 వరల్డ్ కప్ ఆడినా అది వేరు! అది వన్డే వరల్డ్ కప్‌తో సమానం కాదు..
వన్డే వరల్డ్ కప్ తర్వాత టీ20ల్లో కొనసాగాలని రోహిత్ అనుకుంటే, 2024 టీ20 వరల్డ్ కప్ ఆడగలడేమో. రోహిత్‌కి గత వన్డే వరల్డ్ కప్‌లో అదిరిపోయే రికార్డు ఉంది. ఒకే ఎడిషన్‌లో 5 సెంచరీలు కొట్టడం మామూలు విషయం కాదు..
విరాట్ కోహ్లీ చాలా చక్కని ఫామ్‌లో ఉన్నాడు. కొన్ని నెలలుగా అదిరిపోయే బ్యాటింగ్ చేస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా ఎక్కువగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడుతుంది. విరాట్‌కి కూడా ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావచ్చు..
ఈ ఇద్దరూ కచ్ఛితంగా ఆఖరి వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని కసిగా ఆడతారు. ఇక శుబ్‌మన్ గిల్ సుప్రీమ్ ఫామ్‌లో ఉన్నాడు. అతనికి ఇండియాలో అదిరిపోయే రికార్డు ఉంది. ఈ ముగ్గురూ కలిసి నిలబడి ఆడితే, టీమిండియా వరల్డ్ కప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ..