రోహిత్ శర్మ సింహాంలాంటోడు, విరాట్ కోహ్లీ భారత జట్టును... సన్‌రైజర్స్ ప్లేయర్ సిద్ధార్థ్ కౌల్ కామెంట్స్..
దేశవాళీ టోర్నీల్లో ఆకట్టుకుంటున్నా, భారత జట్టులో పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వని ప్లేయర్లలో సిద్ధార్థ్ కౌల్ ఒకడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడే సిద్ధార్థ్ కౌల్, భువీ, నటరాజన్, సందీప్ శర్మలాంటి పేసర్లు గాయపడితే బౌలింగ్‌కి దిగుతాడు.
31 ఏళ్ల సిద్థార్థ్ కౌల్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2008లో అండర్19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన సిద్ధార్థ్ కౌల్, 2017లో 10 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి అదరగొట్టాడు.
తాజాగా భారత జట్టు పర్ఫామెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు సిద్ధార్థ్ కౌల్. ‘గంగూలీ సర్, భారత క్రికెట్ ఆలోచనను పూర్తిగా మార్చేశాడు. గంగూలీ శఖంలో భారత జట్టు పర్ఫామెన్స్ చాలా మెరుగైంది.
ఆ తర్వాత ధోనీ చాలా కూల్ అండ్ ఇంటెలిజెంట్. ధోనీ నాకు అన్నలాంటి వాడు. అతనితో ఎప్పుడు ఛాట్ చేసినా, ధోనీ నుంచి వచ్చే రిప్లై ఊహించని విధంగా ఉంటాయి. ముక్కుసూటిగా మాట్లాడే ధోనీ, మనలో ఆత్మవిశ్వాసం పెంచేలా చేస్తాడు.
రోహిత్ శర్మ సింహాంలాంటోడు. నాకు తెలిసి అతను మళ్లీ కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. ఓ మ్యాచ్ లేదా టోర్నమెంట్ వల్ల గొప్ప ప్లేయర్ల రాత మారిపోదు. ఇంగ్లాండ్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తాడని చెప్పగలను.
నేను రోహిత్ శర్మలాంటి ఓపెనర్‌ని ఇంతవరకూ చూడలేదు. రోహిత్ శర్మ ఎలాంటి వాడంటే అతనితో ఏ విషయాన్నైనా పంచుకోవచ్చు. ఏ సమస్యకైనా అతను 2 నిమిషాల్లో పరిష్కరం చెబుతాడు...
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడి, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతున్నారు భారత ప్లేయర్లు. ఇది భారత జట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రిథమ్‌లో ఉన్న ప్లేయర్లు, ఫార్మాట్‌కి తగ్గట్టుగా సర్దుకుపోతే సరిపోతుంది...
విరాట్ కోహ్లీ భారత జట్టును ఓ ఆర్మీలా తయారుచేశాడు. ఆ ఆర్మీకి కోహ్లీయే కమాండర్. కమాండర్ ఎప్పుడూ కోహ్లీలాగే టాప్‌లో ఉండాలి. అతను దృఢమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు...
విరాట్ కోహ్లీ భారత దేశానికి గర్వకారణం. భారత జాతీయ పతకాన్ని ధరించే సైనికుల్లో ఎలాంటి తపన, దేశభక్తి, పోరాట ప్రటిమ ఉంటాయో కోహ్లీలో కూడా అవన్నీ పుష్కలంగా ఉంటాయి...
సైనికులు ఏ యుద్ధం వచ్చినా, పోరాడేందుకు సిద్దంగా ఉంటారు, ఎలాంటి పర్వతాన్నైనా అధిరోహించగలుగుతారు. విరాట్ కోహ్లీలో ఉన్న ఆ పోరాట ప్రటిమ వల్లే భారత జట్టు అన్ని ఫార్మాట్లలో టాప్‌లోకి దూసుకెళ్లింది...’ అంటూ చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్ కౌల్.
‘నాకు డేల్ స్టెయిన్ అంటే చాలా అభిమానం. అతని బౌలంగ్‌ని ఇష్టపడతాను. నా ఆల్‌టైం బెస్ట్ ఓవర్‌సీస్ ఐపీఎల్ బౌలర్ కూడా డేల్ స్టెయిన్...’ అన్నాడు సిద్ధార్థ్ కౌల్.