MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • సౌతాఫ్రికా టూర్‌కి ముందు టీమిండియాకి ఊహించని షాక్... ప్రాక్టీస్ సెషన్స్‌లో రోహిత్ శర్మకు గాయం...

సౌతాఫ్రికా టూర్‌కి ముందు టీమిండియాకి ఊహించని షాక్... ప్రాక్టీస్ సెషన్స్‌లో రోహిత్ శర్మకు గాయం...

సౌతాఫ్రికా టూర్‌కి సిద్ధమవుతున్న భారత జట్టుకి ఊహించని షాక్ తగిలింది. మరో మూడు రోజుల్లో సఫారీ పర్యటనకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భారత టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 13 2021, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టూర్ కోసం ఇప్పటికే భారత జట్టు, ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన ఫైవ్ స్టార్ హోటెల్‌లో క్వారంటైన్ గడుపుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

మూడు రోజుల పాటు సాగే క్వారంటైన్ ముగిసిన తర్వాత ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్‌లో నేరుగా జోహాన్‌బర్గ్ చేరుకునే భారత జట్టు, అక్కడ మరో ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో గడుపుతుంది...

311

ఆ తర్వాత ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొని, డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ టెస్టు ఆడుతుంది. ఈ సిరీస్‌కి టెస్టు వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్న విషయం తెలిసిందే...

411

వన్డే టీమ్‌కి కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మను టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఏడాదిగా ఫెయిల్ అవుతున్న అజింకా రహానేను ఆ బాధ్యతల నుంచి తప్పించింది...

511

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొనని రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్‌‌లతో పాటు మొదటి టెస్టులో గాయపడిన అజింకా రహానే... కొన్నిరోజులుగా ముంబైలో బీసీసీఐ మినీ క్యాంపులో పాల్గొంటున్నారు...

611

భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఆధ్వర్యంలో ఈ ప్లేయర్లు, ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్స్‌లోనే రోహిత్ శర్మకు తీవ్ర గాయం అయ్యిందని సమాచారం...

711

ఇప్పటికే గాయాల కారణంగా చాలా సార్లు సిరీస్‌లకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. 2020 ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి రెండు టెస్టులు ఆడలేదు...

811

సౌతాఫ్రికా టూర్‌లో వైస్ కెప్టెన్‌గా, వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్న సమయంలో రోహిత్ శర్మ, మరోసారి గాయపడడంతో తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...

911

అయితే రోహిత్ శర్మ ఫిట్‌గా ఉన్నాడని, ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడిన త్వరగానే కోలుకున్నాడని మొదటి టెస్టు సమయానికి జట్టుకి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ అధికారులు తెలియచేశారు...

1011

ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్యాంపుకి విరాట్ కోహ్లీ ఇలా రాలేదని సమాచారం. నేడు, లేదా రేపు విరాట్ కోహ్లీ క్వారంటైన్‌లో చేరతాడని సమాచారం...

1111

అన్ని విషయాల్లో అందరికంటే ముందు ఉండే విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా టూర్‌కి ముందు ఇలా లేటు చేయడానికి బీసీసీఐ వన్డే కెప్టెన్సీ విషయంలో వ్యవహరించిన తీరు నచ్చకపోవడమే అంటున్నారు అభిమానులు...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved