- Home
- Sports
- Cricket
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025: పింక్ క్యాప్స్ తో రోహిత్, పాండ్యా.. మరి జడేజాకు గ్రీన్ క్యాప్ ఎందుకు?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: పింక్ క్యాప్స్ తో రోహిత్, పాండ్యా.. మరి జడేజాకు గ్రీన్ క్యాప్ ఎందుకు?
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ అధికారిక ఫోటో షూట్ సందర్భంగా భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలు వేర్వేరు రంగుల టోపీలు (క్యాప్స్) ధరించారు. ఐసీసీ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rohit Sharma and Ravidnra Jadeja
Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం (ఫిబ్రవరి 19న) ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్, దుబాయ్ లు వేదికలుగా ఉన్నాయి. భారత్ తన మ్యాచ్ లను అన్నింటినీ దుబాయ్ లో ఆడనుంది. టోర్నీ ప్రారంభం నేపథ్యంలో భారత ఆటగాళ్ళు టోర్నమెంట్ కోసం ఫోటో షూట్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా పింక్ క్యాప్స్ ధరించి, రవీంద్ర జడేజా గ్రీన్ క్యాప్ ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. టీమిండియా ప్లేయర్లు సాధారణంగా నీలిరంగు క్యాప్‌ను ధరిస్తారు. అయితే, దానికి బదులుగా పింక్, గ్రీన్ క్యాప్స్ ధరించిన ఆటగాళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
IPL 2025
భారత ప్లేయర్లు వేర్వేరు రంగుల క్యాప్స్ ఎందుకు ధరించారు?
భారత ఆటగాళ్ళు వేర్వేరు రంగుల క్యాప్స్ ఎందుకు ధరించారనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దీనికి సమాధానం చాలా సింపుల్. ఈ ముగ్గురు ఆటగాళ్ళు ఐసీసీ వన్డే, టీ20 జట్లలో చోటు సంపాదించారు. ఐసీసీ టీ20 జట్టులో ఉన్నవారికి పింక్ క్యాప్, టెస్ట్ జట్టులో ఉన్నవారికి గ్రీన్ క్యాప్, వన్డే జట్టులో ఉన్నవారికి బ్లూ క్యాప్‌ను ఐసీసీ బహుమతిగా అందిస్తుంది.
భారత ఆటగాళ్లు క్యాపులు ధరించిన ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Image Credit: Getty Images
రోహిత్, హార్దిక్ 2024 ఐసీసీ టీ20 జట్టులో సభ్యులుగా ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా కూడా టీ20 జట్టులో ఉన్న మూడో భారత ఆటగాడు. ఐసీసీ టీ20 జట్టులో భాగమైనందుకు వీరికి పింక్ క్యాప్ బహుమతిగా లభించింది. జస్ప్రీత్ బుమ్రా టోర్నమెంట్‌కు రాలేదు కాబట్టి ఆయనకు క్యాప్ అందలేదు. రవీంద్ర జడేజా 2024 ఐసీసీ టెస్ట్ జట్టులో సభ్యుడు కాబట్టి గ్రీన్ క్యాప్ ధరించారు. జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్ కూడా టెస్ట్ జట్టులో ఉన్నప్పటికీ, ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో లేనందున వారికి క్యాప్ అందలేదు.
ఐసీసీ గత సంవత్సరం ఉత్తమ టీ20 ఆటగాడిగా ఎంపికైన భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ ట్రోఫీ అందుకున్నారు. వన్డే జట్టులో ఒక్క భారత ఆటగాడు కూడా లేనందున ఎవరికీ బ్లూ క్యాప్ రాలేదు.
గత సంవత్సరం ఐసీసీ T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ఉత్తమ T20 ఆటగాడిగా ICC ట్రోఫీని అందుకున్నాడు. ODI జట్టులో భారతీయ ఆటగాడు లేకపోవడంతో, భారత ఆటగాళ్లెవరికీ బ్లూ క్యాప్ లభించలేదు.
ఐసీసీ పురుషుల టీ20 జట్టు ఆఫ్ ది ఇయర్ 2024
రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ అజామ్, నికోలస్ పూరన్, సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.