ఇప్పుడు నా గాయం తగ్గిపోయింది... గాయం తగ్గకపోయినా ఐపీఎల్ ఆడింది అందుకే... క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ...

First Published 21, Nov 2020, 5:14 PM

IPL 2020 సీజన్‌లో సిక్సర్ల మోత, వికెట్ల బోల్తా కంటే ఎక్కువగా చర్చకు వచ్చింది రోహిత్ శర్మ గాయం టాపిక్. అప్పుడెప్పుడో అక్టోబర్ 18న జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో గాయపడిన రోహిత్ శర్మ...ఆ తర్వాత చాలా పెద్ద డిస్కర్షన్‌కి ఆస్కారం ఇచ్చాడు. రోహిత్ ఫిట్‌గా లేడని సెలక్టర్లు ఆసీస్ టూర్‌కి అతన్ని పక్కనబెడితే, తాను ఫిట్‌గా ఉన్నానంటూ హిట్ మ్యాన్ బరిలో దిగడం పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించాడు శర్మగారి అబ్బాయి.

ఐపీఎల్ చరిత్రలో చారిత్రక మ్యాచ్‌గా నిలిచిపోయింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్...

ఈ మ్యాచ్‌లో మొదటి సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన రోహిత్ శర్మ... ఆ తర్వాత జరిగిన డబుల్ సూపర్ ఓవర్ సమయంలో ఫీల్డింగ్‌కి కూడా రాలేదు.

తొడ కండరాలు పట్టేయడంతో ఆ తర్వాత నాలుగు మ్యాచులకు దూరంగా ఉన్న రోహిత్ శర్మను ఆసీస్ టూర్‌కి సెలక్ట్ చేయలేదు బీసీసీఐ సెలక్టర్లు. ఇది జరిగిన రెండు రోజులకే తాను ఫిట్‌గా ఉన్నానంటూ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలో దిగాడు రోహిత్ శర్మ.

ఐపీఎల్‌లో ఆడిన క్రికెటర్, టీమిండియాకు ఆడలేడా? అని సెలక్టర్ల తీరును గౌతమ్ గంభీర్ ప్రశ్నిస్తే... టీమిండియాకు ఆడడం కంటే, ఐపీఎల్‌కు ఆడడం రోహిత్ శర్మకు ఎక్కువైపోయిందా? అంటూ దిలీప్ వెంగ్‌సర్కార్, రోహిత్ తీరును విమర్శించాడు.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ... తన గాయం గురించి క్లారిటీ ఇచ్చాడు... ‘నా గాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే దృఢంగా, ఫిట్‌గా అవ్వడానికి ప్రయత్నాలు మొదలెట్టాను... సుదీర్ఘ ఫార్మాట్‌లో క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాను...

టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు నాకు ఎలాంటి గాయం లేదనే భావన రావాలి...అందుకోసమే ప్రయత్నిస్తున్నా. ఈ కారణంగానే నేను ఇప్పడు జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

రోహిత్ శర్మ గాయం కేవలం 70 శాతమే మాత్రమే తగ్గిందని, అతను నూటికి నూరు శాతం ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించిన విషయం తెలిసిందే.

గాయం పూర్తిగా తగ్గని కారణంగానే రోహిత్ శర్మను వన్డేలు, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉంచిన సెలక్టర్లు... టెస్టు సిరీస్‌కు మాత్రం ఎంపిక చేశారు...

‘నా గాయం ఇంత పెద్ద వివాదం రేపుతుందని అనుకోలేదు. జనాలు దేనీ గురించైతే మాట్లాడుకుంటున్నారో దానిపైన నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా... నేను తరుచూ బీసీసీఐ, మరియు ముంబై ఇండియన్స్ జట్లతో మాట్లాడుతున్నా... నాకు ఎవ్వరితోనూ ఎలాంటి గొడవలు లేవు...’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

‘ముంబై ఇండియన్స్‌ జట్టు యాజమాన్యంతో నా గాయం గురించి చెప్పాను. పొట్టి ఫార్మాట్ కాబట్టే ఐపీఎల్‌ ఆడగలిగాను... ఇప్పుడు ఆడబోయేది టెస్టు సిరీస్ కాబట్టి నూటికి నూరు శాతం ఫిట్‌నెస్ సాధించడం పైనే ఫోకస్ పెడుతున్నాను... ఇప్పుడు అది అవసరం కూడా’ అంటూ చెప్పాడు హిట్ మ్యాన్.

మొదటి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ గైర్హజరీతో మిగిలిన మూడు టెస్టులకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు...

రోహిత్ శర్మ గైర్హజరీతో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్‌కి వన్డేలు, టీ20ల్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కిన  విషయం తెలిసిందే..