MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • అడిలైడ్ వన్డేలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఐదు రికార్డులు

అడిలైడ్ వన్డేలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఐదు రికార్డులు

Rohit Sharma : ఇండియా vs ఆస్ట్రేలియా రెండో వన్డే అడిలైడ్ లో జరుగుతోంది. సిరీస్ ను కోల్పోకుండా ఉండాలంటే భారత్ కు ఈ మ్యాచ్ గెలుపు చాలా కీలకం. ఇక్కడ రోహిత్ శర్మ ఐదు చారిత్రాత్మక రికార్డులపై కన్నేశాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Oct 23 2025, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అడిలైడ్ లో రోహిత్ శర్మ రికార్డులు
Image Credit : ANI

అడిలైడ్ లో రోహిత్ శర్మ రికార్డులు

భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేలో చరిత్ర సృష్టించే ఛాన్స్ ఉంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా పెర్త్ లో జరిగిన తొలి వన్డేలో కేవలం 8 పరుగులకే అవుట్ అయిన రోహిత్, ఇప్పుడు రెండో వన్డేలో తన బ్యాట్ పవర్ చూపించడానికి గ్రౌండ్ లో అగుడుపెట్టాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 0-1తో వెనుకబడి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ గెలుపు భారత్‌కు కీలకం. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ రికార్డులు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆస్ట్రేలియాలో 1000 వన్డే పరుగులు పూర్తి చేసే తొలి భారత ఆటగాడు రోహిత్
Image Credit : ANI

ఆస్ట్రేలియాలో 1000 వన్డే పరుగులు పూర్తి చేసే తొలి భారత ఆటగాడు రోహిత్

కంగారూ నేలపై ఆడిన 11 వన్డేల్లో రోహిత్ ఇప్పటికే 998 పరుగులు చేశారు. అడిలైడ్ ఓవల్ లో 2 పరుగులు చేసి, ఆస్ట్రేలియాలో భారత్ తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఆయన తర్వాత విరాట్ కోహ్లీ (802 పరుగులు), సచిన్ టెండుల్కర్ (740 పరుగులు) ఉన్నారు.

36
అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీల రికార్డు
Image Credit : ANI

అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీల రికార్డు

అడిలైడ్ ఓవల్ వేదికగా రోహిత్ శర్మ సెంచరీ సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడవ భారత బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ ఘనతను సాధించిన వారిలో లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండుల్కర్ (100 సెంచరీలు), విరాట్ కోహ్లీ (82 సెంచరీలు) మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 49 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ఈ వన్డేలో సెంచరీ సాధిస్తే, ఆయన పేరు క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలుస్తుంది.

46
వన్డేల్లో అత్యధిక సిక్సులు
Image Credit : X/BCCI

వన్డేల్లో అత్యధిక సిక్సులు

రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటివరకు 274 మ్యాచ్‌ల్లో 344 సిక్సులు కొట్టారు. అడిలైడ్ లో వన్డేలో మరో 8 సిక్సులు కొడితే, ఆయన మొత్తం 352 సిక్సులకు చేరుకుంటారు. దీంతో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది (351 సిక్సులు) రికార్డును అధిగమించి వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలుస్తారు.

56
భారత వన్డే చరిత్రలో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా రోహిత్
Image Credit : X/BCCI

భారత వన్డే చరిత్రలో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా రోహిత్

రోహిత్ శర్మ ఇప్పటివరకు భారత్ తరఫున 274 వన్డేల్లో 48.59 సగటుతో 11,176 పరుగులు సాధించారు. మరో 46 పరుగులు చేస్తే, ఆయన సౌరవ్ గంగూలీ (11,221 పరుగులు) రికార్డును అధిగమించి భారత వన్డే చరిత్రలో మూడవ అత్యధిక రన్ స్కోరర్‌గా నిలుస్తారు. రోహిత్ ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు, 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు సాధించాడు.

66
ఆస్ట్రేలియాపై 100 సిక్సులు కొట్టే చారిత్రాత్మక ఘనత
Image Credit : ANI

ఆస్ట్రేలియాపై 100 సిక్సులు కొట్టే చారిత్రాత్మక ఘనత

రోహిత్ శర్మ ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఆడిన 47 వన్డేల్లో 88 సిక్సులు కొట్టారు. అడిలైడ్ లో 12 సిక్సులు కొడితే, ఆయన ఆస్ట్రేలియాపై వన్డేల్లో 100 సిక్సులు కొట్టిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఆయన తర్వాత ఇయాన్ మోర్గన్ (48 సిక్సులు), సచిన్ టెండుల్కర్ (35 సిక్సులు) ఉన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
రోహిత్ శర్మ
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Recommended image2
Smriti Mandhana: బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.. ప్రపంచంలో మొదటి ప్లేయర్‌గా స్మృతి మంధాన సరికొత్త రికార్డు
Recommended image3
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Related Stories
Recommended image1
టీ20 ప్రపంచకప్‌ 2026 : రేసులో 20 జట్లు.. దబిడిదిబిడే !
Recommended image2
షాకింగ్.. రోహిత్-కోహ్లీలు ఆటకు సిద్ధంగా లేరా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved