- Home
- Sports
- Cricket
- లార్డ్స్‌లో రోహిత్ శర్మ రికార్డు ఫీట్... 69 ఏళ్ల తర్వాత లార్డ్స్ మైదానంలో తొలిసారిగా...
లార్డ్స్‌లో రోహిత్ శర్మ రికార్డు ఫీట్... 69 ఏళ్ల తర్వాత లార్డ్స్ మైదానంలో తొలిసారిగా...
లార్డ్స్ టెస్టులో భారత జట్టుకి శుభారంభం దక్కింది. వర్షం కారణంగా అంతరాయం కలిగినా... ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ఎంతో సహనంగా బ్యాటింగ్ చేస్తున్నారు భారత ఓపెనర్లు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, కెఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్‌తో అతనికి సహకారం అందిస్తున్నాడు...

34 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 103 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ శర్మ 113 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 పరుగులతో దూకుడుగా ఆడుతుండగా కెఎల్ రాహుల్ 92 బంతుల్లో బౌండరీలేమీ లేకుండా 16 పరుగులు చేసి జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు.
లార్డ్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు 50+ భాగస్వామ్యం నెలకొల్పడం ఇది మూడోసారి. అయితే ఆఖరిసారిగా 69 ఏళ్ల కిందట ఫస్ట్ వికెట్‌కి ఫిఫ్టీ ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పారు భారత ఓపెనర్లు...
1956లో మన్కడ్, రాయ్ కలిసి లార్డ్స్ టెస్టులో మొదటి వికెట్‌కి 106 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఎన్ని టెస్టులు జరిగినా తొలి ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌కి 50+ కానీ 100+ భాగస్వామ్యం కానీ నమోదుకాలేదు...
గత 10 ఏళ్లల్లో ఇంగ్లాండ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం... చివరిసారిగా 2015లో ఆస్ట్రేలియా ఓపెనర్లు క్రిస్ రోజర్స్, డేవిడ్ వార్నర్ కలిసి తొలి వికెట్‌కి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
ఇంతకుముందు ఇంగ్లాండ్‌లో వన్డేల్లో, టీ20ల్లో 50+ పరుగులు చేసిన రోహిత్ శర్మ... టెస్టుల్లోనూ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇంగ్లాండ్‌లో మూడు ఫార్మాట్లలోనూ హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ...
ఓపెనర్‌గా ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిన మొదటి టెస్టులోనూ హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్న రోహిత్ శర్మ... ఇంగ్లాండ్ టూర్‌లో లార్డ్స్ టెస్టులో హాఫ్ సెంచరీ అందుకున్నాడు...
ఇంగ్లాండ్‌లో అత్యధిక 50+ పరుగులు చేసిన రెండో పర్యాటక జట్టు ఓపెనర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. వన్డే, టీ20ల్లో కలిపి 16 సార్లు 50+ పరుగులు చేసిన రోహిత్ శర్మ... క్రిస్ గేల్, గ్రేనిడ్జ్ (17 సార్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు...