కోహ్లీ సేనకి అభినందనలు తెలిపిన రోహిత్ శర్మ... రికార్డుల్లో విరాట్ ఒక్కడే...
First Published Dec 6, 2020, 7:03 PM IST
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య వివాదాలున్నాయని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా టూర్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం కావడం వెనక విరాట్ ఉన్నాడనే టాక్ కూడా వినిపించింది. అయితే సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టీవ్‌గా ఉండే రోహిత్ శర్మ, ఎట్టకేలకు ఐపీఎల్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ట్వీట్ చేశాడు. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియాకు అభినందనలు తెలిపాడు రోహిత్. మరోవైపు విజయానంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ గురించి ప్రస్తావించాడు విరాట్ కోహ్లీ.

‘వాట్ ఏ సిరీస్ విన్ ఫర్ టీమిండియా... వాళ్లు చక్కగా, అందంగా ఆడిన విధానం నాకెంతో నచ్చింది... ప్రతీ ప్లేయర్‌కి బిగ్ థమ్స్ అప్ ... ’ అంటూ బీసీసీఐని ట్యాగ్ చేశాడు రోహిత్ శర్మ. అయితే విరాట్‌తో పాటు ఏ ఒక్క ప్లేయర్‌ని రోహిత్ ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం విశేషం.

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాలపై టీ20 సిరీస్ గెలిచిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?