MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పెళ్లిరోజునే వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ... రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కి డబుల్ సెలబ్రేషన్స్...

పెళ్లిరోజునే వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ... రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కి డబుల్ సెలబ్రేషన్స్...

టీ20లతో పాటు వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీని బలవంతంగా తప్పించి, ఆ బాధ్యతలు రోహిత్‌కి అప్పగించడంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది. అవన్నీ పక్కనబెడితే ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కి ఈరోజు చాలా స్పెషల్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 13 2021, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో రోహిత్ శర్మకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. భారత సారథి విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే, మాస్ జనాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

తెలుగు జీన్స్ కలిసిన రోహిత్ శర్మకు ఈరోజు (డిసెంబర్ 13) చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఐదేళ్ల క్రితం ఇదే రోజున రితికా సగ్దేని పెళ్లాడాడు రోహిత్. అంతేకాదు వన్డేల్లో త్రిబుల్ డబుల్ సెంచరీ బాదింది కూడా నేడే.

312

స్పోర్ట్స్ మేనేజర్‌గా వ్యవహారిస్తున్న రితికాకి, రోహిత్ శర్మకు పెళ్లికి ఆరేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అంతకుముందు విరాట్ కోహ్లీకి కూడా మేనేజర్‌గా వ్యవహారించింది రితికా...

412

యువరాజ్ సింగ్‌కి రాఖీ కడుతూ అన్నయ్య అని పిలిచేది రితికా. అలా రితికాపై రోహిత్ శర్మకు మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. అది స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది...

512

తనకి జీవితంలో ఎంతో విలువైన ముంబైలోని బోరివాలి స్పోర్ట్స్ క్లబ్‌కి రితికాను తీసుకెళ్లిన రోహిత్ శర్మ... మోకాళ్లపై నుంచొని రింగ్‌తో ఆమెకు ప్రపోజ్ చేశాడట...

612

11 ఏళ్ల వయసులో ఇదే స్పోర్ట్స్ క్లబ్‌లో క్రికెటర్‌గా కెరీర్‌ను మొదలెట్టాడు రోహిత్ శర్మ... రోహిత్ ప్రపోజల్‌కి రితికా ‘ఎస్’ చెప్పడంతో వీరిద్దరూ డిసెంబర్ 13, 2015లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు...

712

పెళ్లికి ముందు దాకా భారత జట్టులోకి వస్తూ పోతూ ఉన్న రోహిత్ శర్మ, ఆ తర్వాత టీమిండియాలో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు...

812

తన పెళ్లిరోజునే వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ బాదాడు రోహిత్ శర్మ... 2017లో శ్రీలంకపై మొహాలీలో రికార్డు స్థాయిలో మూడో ద్విశతకం బాదాడు...

912

153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ నమోదుచేసిన రోహిత్, ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు...

1012

65 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన రోహిత్, 115 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత 36 బంతుల్లోనే 200 మార్కు అందుకున్నాడు రోహిత్ శర్మ.

1112

‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ బాదగా, వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు..

1212

రోహిత్ శర్మ కాకుండా ఎవ్వరూ వన్డేల్లో రెండోసారి కూడా డబుల్ సెంచరీ మార్కును అందుకోలేకపోయారు... రో‘హిట్ మ్యాన్’ మాత్రం మూడు సార్లు ఈ ఫీట్ సాధించాడు...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
Latest Videos
Recommended Stories
Recommended image1
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Recommended image2
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Recommended image3
Vaibhav Suryavanshi: టీమిండియాలోకి వైభవ్.. ఒక్క మ్యాచ్‌కి ఎంత సంపాదిస్తాడో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved