- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మ మామూలోడు కాదు! పెళ్లికి ముందే ముగ్గురితో ప్రేమాయణం... స్కూల్ డేస్‌లోనే...
రోహిత్ శర్మ మామూలోడు కాదు! పెళ్లికి ముందే ముగ్గురితో ప్రేమాయణం... స్కూల్ డేస్‌లోనే...
రోహిత్ శర్మ, ఏప్రిల్ 30న 36వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు.. ప్రస్తుత తరంలో వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్నా, లేటు వయసులో టీమిండియా కెప్టెన్సీ తీసుకున్నాడు రోహిత్. అభిమానులు ముద్దుగా ‘హిట్‌మ్యాన్’ అని పిలుచుకునే రోహిత్‌కి వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలున్నాయి.

ఐపీఎల్‌లో ప్లేయర్‌గా ఆరుసార్లు, కెప్టెన్‌గా ఐదు సార్లు టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు టీ20 కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. కేప్‌టౌన్ టెస్టు తర్వాత టీమిండియాకి త్రీ ఫార్మాట్ కెప్టెన్‌గా మారాడు.
20 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన రోహిత్ శర్మ, 2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. నిలకడలేమి కారణంగా ప్రారంభంలో జట్టులోకి వస్తూ పోతూ తెగ ఇబ్బంది పడ్డాడు. అయితే 2013 ఐపీఎల్ తర్వాత రోహిత్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది...
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియాకి ఓపెనర్‌గా మారిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి వైట్ బాల్ ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వన్డే వరల్డ్ కప్ 2019లో 5 సెంచరీలు చేసిన రోహిత్, 2023 ప్రపంచ కప్‌లో సారథిగా ఆడబోతున్నాడు..
రితికా సాజ్దేతో పెళ్లికి ముందు రోహిత్‌కి కొంతమంది బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇందులో కొన్ని నిజమైనని కూడా రుజువైంది కూడా...
చూడడానికి సైలెంట్‌గా కనిపిస్తున్నా, స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడే తన క్లాస్ మెట్ అయిన ఓ అమ్మాయికి ప్రపోజ్ చేశాడట రోహిత్ శర్మ. చాలామంది జీవితాల్లో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’లాగే రోహిత్ శర్మ చిన్ననాటి ప్రేమకథ కూడా స్కూల్ డేస్ తర్వాత అక్కడే ఫుల్‌స్టాప్ పడిపోయింది...
ఆ తర్వాత క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో రోహిత్ శర్మకి హైదరాబాద్ కి చెందిన ఓ యువతి పరిచయమైంది. రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ తెలుగు మహిళ కావడంతో హిట్ మ్యాన్‌కి తెలుగు కూడా కాస్త వచ్చు. ఈ పరిచయం కాస్త మరికొంత దూరం వెళ్లింది...
హైదరాబాదీ మహిళతోతో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నాడు రోహిత్ శర్మ. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ కొన్నాళ్లకే ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. స్టార్ క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో బాలీవుడ్ హాట్ బాంబ్ సోఫియా హయత్‌తో రోహిత్ పీకల్లోతు ప్రేమలో మునిగాడు...
ఈ ఇద్దరూ పబ్లిక్‌గానే పబ్‌లలో తిరుగుతూ మీడియాకి దొరికిపోయారు. 2012లో సోఫియా, తాను రోహిత్ శర్మతో డేటింగ్ చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించింది కూడా. ఆ తర్వాత సోఫియాతో కూడా రోహిత్ విడిపోయాడు..
రోహిత్ శర్మ జెంటిల్మెన్ కాదని, అతను ఓడిపోవడం చూడాలని కోరుకుంటున్నట్టు సంచలన పోస్టులు కూడా చేసింది సోఫియా హయత్... ఇప్పటికీ ఆమె ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ట్వీట్లు అలాగే ఉన్నాయి...
ముగ్గురితో ప్రేమాయణం బెడసి కొట్టిన తర్వాత రోహిత్ శర్మ జీవితంలోకి రితిక వచ్చింది. వీరిద్దిరి లవ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. పెళ్లికి ముందు రితికా స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసేది. విరాట్ కోహ్లీకి కూడా మేనేజర్‌గా కొన్నాళ్లు పనిచేసింది రితికా...
విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మకు మేనేజర్‌గా వచ్చింది రితికా. అలా ఏర్పడిన పరిచయం తర్వాత స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి చివరకు పెళ్లి దాకా వెళ్లింది...
బోరవాలి స్పోర్ట్స్ క్లబ్ లో రితికాకి మెకాలిపై కూర్చొని మరీ ప్రపోజ్ చేశాడట రోహిత్ శర్మ. మనోడిలోని రొమాంటిక్ యాంగిల్‌కి పడిపోయిన రితికా, ఎస్ చెప్పడంతో 2015లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు...
ఎనిమిదేళ్లుగా వీరి దాంపత్య జీవితం సజావుగా సాగుతోంది. వీరికి సమైరా అనే ఐదేళ్ల కూతురు కూడా ఉంది. కూతురు సమైరాకి సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు రోహికా జంట...