- Home
- Sports
- Cricket
- కెప్టెన్‌గా ఒక్క ఫైనల్ కూడా ఓడిపోని రోహిత్ శర్మ... డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అదే ట్రాక్ రికార్డు రిపీట్ అయితే...
కెప్టెన్‌గా ఒక్క ఫైనల్ కూడా ఓడిపోని రోహిత్ శర్మ... డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అదే ట్రాక్ రికార్డు రిపీట్ అయితే...
ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫైయర్‌లో ఓడింది. మొదటి క్వాలిఫైయర్ గెలిచి, సీఎస్‌కే ఫైనల్ చేరిన తర్వాత ఆ జట్టు కోచ్ డ్వేన్ బ్రావో, ఫైనల్‌కి ముంబై ఇండియన్స్ మాత్రం రావద్దని కామెంట్ చేశాడు...

Image credit: Mumbai Indians
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కే ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ వద్దు అనే భయం తెప్పించిన ఘనత రోహిత్ శర్మకు మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ చేతుల్లో ఫైనల్స్ ఆడిన మూడు సార్లూ ఓడింది సీఎస్‌కే...
కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటిదాకా ఆడిన ఏ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఓటమిని అందుకోలేదు. ఐపీఎల్ 2013 సీజన్‌లో మొదటిసారి ముంబై ఇండియన్స్ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ, ఆ సీజన్‌లో టీమ్‌ని ఫైనల్ చేర్చి మొట్టమొదటి టైటిల్ అందించాడు..
ఆ తర్వాత 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ ఫైనల్‌లో కూడా ముంబై ఇండియన్స్ టైటిల్ అందుకుంది. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ ఫైనల్స్‌లోనూ రోహిత్ టీమ్‌కి విజయం దక్కింది..
Asia Cup 2018
టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా ఆడిన ఆసియా కప్ 2018 టోర్నీలో భారత జట్టు టైటిల్ గెలిచింది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ని ఓడించిన రోహిత్ సేన, అదే ఏడాది నిదహాస్ ట్రోఫీ ఫైనల్‌లోనూ విజయాన్ని అందుకుంది...
PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000200B)
కెప్టెన్‌గా తన కెరీర్‌లో 8 ఫైనల్స్ ఆడిన రోహిత్ శర్మ, 8 సార్లు కూడా టైటిల్స్ గెలిచాడు. జూన్ 7 నుంచి మొదలయ్యే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, కెప్టెన్‌గా రోహిత్‌కి 9వ ఫైనల్. దీంతో ఈసారి కూడా రోహిత్ తన ట్రాక్ రికార్డు మెయింటైన్ చేస్తాడా?
Rohit Sharma Captain
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిస్తే, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత టీమిండియాకి ఐసీసీ టైటిల్ అందించిన సారథిగా రికార్డు క్రియేట్ చేస్తాడు రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ఆడినా టైటిల్ నెగ్గలేకపోయింది భారత జట్టు..