రోహిత్ శర్మ 50వ సెంచరీ .. సెహ్వాగ్ రికార్డు బ్రేక్
Rohit Sharma: రోహిత్ శర్మ సిడ్నీలో 50వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. భారత ఓపెనర్లలో అత్యధిక రన్స్ స్కోరర్ గా రికార్డు సృష్టించాడు. భారత జట్టుకు విజయాన్ని అందించాడు.

రోహిత్ శర్మ రికార్డు సెంచరీ
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ చివరి మ్యాచ్‌లో భారత జట్టు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి చరిత్ర సృష్టించాడు. 38 ఏళ్ల రోహిత్ 105 బంతుల్లో తన 33వ వన్డే సెంచరీని సాధించాడు.
ఇది రోహిత్ కు 50వ అంతర్జాతీయ సెంచరీ. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన పదిమంది ఆటగాళ్ల జాబితాలో రోహిత్ స్థానం సంపాదించాడు. రోహిత్ ఎనిమిది నెలల తర్వాత వన్డేలో సెంచరీ కొట్టాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసాడు.
𝐇.𝐔.𝐍.𝐃.𝐑.𝐄.𝐃. 💯
Take a bow, Rohit Sharma! 🙇♂
ODI century no. 3️⃣3️⃣ for the #TeamIndia opener👏
Updates ▶ https://t.co/omEdJjQOBf#AUSvIND | @ImRo45pic.twitter.com/vTrIwKzUDO— BCCI (@BCCI) October 25, 2025
అన్ని ఫార్మాట్లలో అత్యంత విజయవంతమైన భారత ఓపెనర్‌గా రోహిత్
ఈ సెంచరీ తర్వాత రోహిత్ శర్మ భారత ఓపెనర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడు వీరేంద్ర సెహ్వాగ్ (15,758 రన్స్) రికార్డును అధిగమించాడు.
- రోహిత్ శర్మ అంతర్జాతీయ ఓపెనర్‌గా 45 సెంచరీలు సాధించాడు
- ఈ విభాగంలో భారత ఆటగాళ్లలో సచిన్ టెండుల్కర్‌తో సమానంగా నిలిచాడు
- ప్రపంచ ఓపెనర్లలో అత్యధిక సెంచరీలతో డేవిడ్ వార్నర్ (49) మాత్రమే ముందున్నాడు
టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, వన్డేల్లో 33 సెంచరీలు సాధించిన రోహిత్, టీ20 ఫార్మాట్‌లో కూడా అత్యధిక సెంచరీల జాబితాలో ముందున్నాడు. 2024 జూలైలో కరీబియన్‌లో జరిగిన ప్రపంచ కప్‌తో టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
100 వన్డే క్యాచ్‌ల క్లబ్‌లో రోహిత్
మొదటి ఇన్నింగ్స్‌లో మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్ అవుట్ చేయడంలో రోహిత్ కీలక క్యాచులు అందుకున్నాడు. ఈ క్యాచ్ లతో వన్డేల్లో 100 క్యాచుల మార్క్‌ను చేరుకున్న ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో ఉన్న భారత దిగ్గజాలలో విరాట్ కోహ్లీ, మహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, సురేశ్ రైనాలు ఉన్నారు.
📸📸
A Ro𝙝𝙞𝙩 Sharma special in Sydney ⭐️
Updates ▶ https://t.co/omEdJjQOBf#TeamIndia | #3rdODI | #AUSvIND | @ImRo45pic.twitter.com/EA9cGdui7G— BCCI (@BCCI) October 25, 2025
ఆస్ట్రేలియాపై అత్యధిక సగటుతో రోహిత్
ఈ మ్యాచ్‌తో రోహిత్‌కు ఆస్ట్రేలియాపై వన్డేల్లో మొత్తం పరుగులు 2500 దాటాయి. ఆస్ట్రేలియాపై రోహిత్ రన్స్ 2500+ కాగా, భారత ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండుల్కర్ 3077 రన్స్ తో టాప్ లో ఉన్నాడు. అంతేకాదు, ఆస్ట్రేలియాపై వన్డేల్లో 57కు పైగా బ్యాటింగ్ సగటుతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాడు.
Rohit Sharma achieves another feat! ✅
He becomes the 2nd #TeamIndia batter after Sachin Tendulkar to complete 2500 ODI runs against Australia 👌
Updates ▶️ https://t.co/omEdJjRmqN#AUSvIND | @ImRo45pic.twitter.com/qi7GMS7HlP— BCCI (@BCCI) October 25, 2025