ఐపీఎల్ 2021 ముందు రోహిత్ శర్మకు రెస్టు... హిట్‌మ్యాన్‌తో పాటు ఆ ఇద్దరికి కూడా...

First Published Mar 2, 2021, 9:53 AM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది టీమిండియా. నాలుగో టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే ఈ టోర్నీలకు రొటేషన్ పద్ధతిలో ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది బీసీసీఐ. ఇప్పటికే టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో జస్ప్రిత్ బుమ్రాకి విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే.