మరో వారం రోజులు ఆసుపత్రిలోనే రిషబ్ పంత్... పూర్తిగా కోలుకోవడానికి 6 నెలల సమయం...
కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. డిసెంబర్ 30న కారు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, మరో వారం రోజులు పాటు ఆసుపత్రిలోనే ఉండబోతున్నాడు...

జనవరి 7న ముంబైలోని కోకిలాబెన్ దీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో రిషబ్ పంత్ మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. అతను మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నాడని సమాచారం...
Rishabh Pant
‘రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. డాక్టర్లు అతని రిహాబ్ ప్రాసెస్‌ని మొదలెట్టారు. త్వరలో అతను వాకర్ ద్వారా నడవబోతున్నాడు. కొన్నిరోజులు మళ్లీ తనకాళ్లపైన నిలబడతాడు. అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుంది...’ అంటూ తెలియచేశారు బీసీసీఐ అధికారి...
Image credit: Getty
డిసెంబర్ 30న ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వేలో రిషబ్ పంత్ కారుకి యాక్సిడెంట్ అయ్యింది. వేగంగా దూసుకెళ్తున్న కారు, అదుపు తప్పి డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం కాగా, రిషబ్ పంత్ మోకాలికి, నుదిటి పైన, వీపు భాగంలో గాయాలయ్యాయి...
Rishabh Pant
యాక్సిడెంట్ జరిగిన వెంటనే రిషబ్ పంత్‌ని ఢిల్లీలోని సాక్ష్యం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి మార్చారు. ఐదు రోజుల చికిత్స తర్వాత ఎయిర్ అంబులెన్స్ ద్వారా రిషబ్ పంత్‌ని ముంబైకి తీసుకొచ్చింది బీసీసీఐ...
Rishabh Pant-Pujara
‘వికెట్ కీపర్‌కి మోకాళ్లు చాలా కీలకం. మోకాళ్లపై రిషబ్ పంత్‌కి అయిన గాయాలు ఎంత వేగంగా కోలుకుంటాయనేది అతనిపైనే ఆధారపడి ఉంది. రిషబ్ పంత్ ఎంత నొప్పిని భరించగలిగితే, అంత వేగంగా కోలుకుంటాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది...’ అంటూ తెలియచేశారు బీసీసీఐ అధికారి...
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2023 సీజన్‌కి కూడా రిషబ్ పంత్ దూరమయినట్టు అధికారికంగా తేలిపోయింది. గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్ దూరం కావడంతో అతని ప్లేస్‌లో కొత్త కెప్టెన్‌ని వెతికే బాధ్యత మేనేజ్‌మెంట్‌పై పడింది.
Image credit: Getty
వచ్చే జూలై నెలలో లండన్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ రీఎంట్రీ ఇస్తాడని కథనాలు వినిపిస్తున్నాయి... అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ సమయానికి రిషబ్ పంత్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి, మునుపటి ఫామ్‌ని అందుకోగలడా? అనేది పెద్ద ఛాలెంజింగ్‌గా మారింది...