MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆడేది లేదు గానీ మరీ ఇంత పొగరా..? పంత్ పై ఆగని ట్రోల్స్

ఆడేది లేదు గానీ మరీ ఇంత పొగరా..? పంత్ పై ఆగని ట్రోల్స్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు.  సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు పంత్ ను ఆటాడుకుంటున్నారు. 

2 Min read
Author : Srinivas M
Published : Nov 30 2022, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆటగాళ్లు కొన్ని మ్యాచ్ లలో విఫలమైనా  ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరు.. విమర్శలు చేసేవాళ్లు చేస్తారేమో గానీ సదరు ఆటగాడి మీద వ్యక్తిగత విమర్శలకు దిగరు. కానీ ఆ ఆటగాడి వ్యవహార శైలి, ఇతరులతో మాట్లాడే తీరులో తేడా ఉంటే మాత్రం  గూబ గుయిమనే రిప్లై ఇస్తారు. తాజాగా  టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా ఇదే తరహా ట్రోలింగ్ కు గురవుతున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అసలే ఫామ్ కోల్పోయి వరుస మ్యాచ్ లలో విఫలమవుతూ సర్వత్రా విమర్శలు  ఎదుర్కుంటున్న పంత్.. న్యూజిలాండ్ తో మూడో  వన్డే కు ముందు  ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేతో మాట్లాడిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో పంత్ ఆడకున్నా బలుపుకేమీ తక్కువ లేదని నెటిజన్లు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

36

విషయానికొస్తే.. మూడో వన్డేకు ముందు  రిషభ్ పంత్ తో హార్షా భోగ్లే   మాట్లాడుతూ ‘నేను గతంలో  వీరేంద్ర సెహ్వాగ్ ను ఈ ప్రశ్న అడిగాను.   మీ వైట్ బాల్ రికార్డ్స్ కంటే టెస్టు రికార్డు బాగున్నాయి..’ అని అడిగాడు. 

46

దానికి పంత్.. ‘సార్,  నా దృష్టిలో రికార్డులు కేవలం  అంకెలు. మీరన్నట్టు నా వైట్ బాల్ రికార్డేమీ మరీ అంత  చెండాలంగా లేదు..’ అని  చెప్పుకొచ్చాడు.  మళ్లీ హర్షా కల్పించుకుని.. ‘నేను చెడ్డదని చెప్పడం లేదు. కానీ నేను దానిని టెస్టు నెంబర్లతో పోల్చుతున్నా..’ అని ప్రశ్నించాడు. 

56

అప్పుడు మళ్లీ పంత్.. ‘సార్ నా వయసు 25 ఏండ్లు. మీరు పోల్చాలనుకుంటే నేను 30-32 ఏండ్లప్పుడు పోల్చినా ఓ లెక్క. కానీ మీరు ఇప్పుడే అలా చేయడంలో  లాజిక్ లేదు..’ అని కొంచెం ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇదే ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. 

66

భోగ్లే అడిగినదానిలో తప్పేముందని, దానికి పంత్ అంత  పొగరుగా  ఆన్సర్ ఇవ్వడం అవసరమా..? అని ప్రశ్నిస్తున్నారు.  బీసీసీఐ అండదండలతో ఊరేగుతున్న నువ్వు.. ఆడకున్నా జట్టులో ఎందుకు ఉంటున్నావో మాకు తెలియదా..? ఇలాంటి పొగరు మాటలు తగ్గించి ముందు ఆటమీద దృష్టి పెట్టు.. అని  అంటున్నారు.

About the Author

SM
Srinivas M
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND A vs SL A: గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఇండియా, శ్రీలంక ప్లేయర్స్.. దంబుల్లా మ్యాచ్‌లో మామూలు రచ్చ కాదు ఇది!
Recommended image2
Deepti Sharma: ఇదెక్కడి మాస్ బౌలింగ్ అబ్బా.. దీప్తి శర్మ దెబ్బకు పాకిస్తాన్ ఖేల్ ఖతం.. 5 వికెట్లతో వరల్డ్ రికార్డ్
Recommended image3
INDW vs PAKW: స‌త్తా చాటిన‌ అమ్మాయిలు.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved