నా కంటే రిషబ్ పంత్ బెటర్, అతనే ఫైనల్ ఆడేందుకు ఫస్ట్ ఛాయిస్... వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా...

First Published May 22, 2021, 11:18 AM IST

2020 ఆస్ట్రేలియా టూర్ ముందు వరకూ కూడా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఫస్ట్ ఛాయిస్. అయితే ఆడిలైడ్ టెస్టు తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. మెల్‌బోర్న్ టెస్టులో తుదిజట్టులోకి వచ్చిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్... భారత జట్టుకి మ్యాచ్ విన్నర్‌గా మారిపోయాడు. దీంతో సాహా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది...