రిషబ్ పంత్ చాలా మొండోడు! ఇలాంటి టైమ్‌లోనూ జోకులు వేస్తున్నాడు... రికీ పాంటింగ్ కామెంట్...
గత ఏడాది చివర్లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియాలో తన క్షేమ సమాచారాన్ని అభిమానులకు తెలియచేసిన రిషబ్ పంత్, మరో రెండు వారాల పాటు ఆసుపత్రిలోనే గడపబోతున్నాడు..
యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్ ఆడడం కాదు కదా, కనీసం స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూసే పొజిషన్‌లో అయినా రిషబ్ పంత్ ఉంటాడా? అనేది అనుమానం...
రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి, అతనిలో ఫోన్‌లో మాట్లాడిన విషయాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. ‘రిషబ్ పంత్ చాలా మొండివాడు. అతనిలో నాకు బాగా నచ్చింది కూడా ఇదే. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని అతనికి ఫోన్‌లో చెప్పాను... అతను మాత్రం ఈ టైమ్‌లో కూడా జోకులు వేస్తూ నవ్విస్తున్నాడు.
ఆ ప్రమాదం గురించి తెలియగానే చాలా భయమేసింది. యాక్సిడెంట్‌కి గురైన కారు స్థితిని చూడగానే ఒళ్లంతా చెమటలు పట్టాయి. రిషబ్ పంత్ చాలా మంచి కుర్రాడు. అతని గురించి తెలిసిన ఎవ్వరైనా, రిషబ్ పంత్‌ని ప్రేమిస్తారు, ఇష్టపడతారు..
రిషబ్ పంత్‌లో ఓ అందమైన ప్రపంచం ఉంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. రిషబ్ పంత్ వీలైనంత తొందరగా క్రీజులోకి తిరిగి రావాలని నేను దేవుడిని కోరుకుంటున్నా. రిషబ్ పంత్ ప్లేస్‌ని రిప్లేస్ చేయడం చాలా కష్టం...
అలాంటి ప్లేయర్లను చెట్టు మీద నుంచి కాయ తెంపినంత ఈజీగా తీసుకురాలేం. అయితే ఇప్పుడు టీమ్‌లో ఉన్న వికెట్ కీపింగ్ బ్యాటర్లే మాకు దిక్కు. వారిలో ఎవరి సత్తాను బట్టి, వారికి అవకాశాలు వస్తాయి...
రిషబ్ పంత్ ఆడేందుకు ఫిట్‌గా లేకపోవచ్చు. అయితే అతను టీమ్‌తో కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అతను మా కల్చరల్ లీడర్. అతను ఉంటే టీమ్‌లో ఉండే సందడి వేరుగా ఉంటుంది..
Rishabh Pant
రిషబ్ పంత్ కోలుకుంటే అతన్ని టీమ్‌తోపాటే ఉంచుతాం. నాతో పాటు డగౌట్‌లో కూర్చోబెట్టుకుంటా. మార్చి మధ్యలో ఢిల్లీలో కలవాలని అనుకుంటున్నాం... అప్పటికి అతను పూర్తిగా కోలుకుంటాడనే అనుకుంటున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్..