ఫినిషర్ రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ఆడిస్తారా... ఇదే పని విరాట్ కోహ్లీ చేసి ఉంటేనా...
వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు వన్డేలో విజయం అందుకుని, సిరీస్ సొంతం చేసుకుంది భారత జట్టు. నయా కెప్టెన్ రోహిత్ శర్మ, పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలి వన్డే సిరీస్ గెలిచాడు. అయితే రెండో వన్డేలో చేసిన ప్రయోగాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి...

తొలి వన్డేలో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ కలిసి ఓపెనింగ్ చేశారు. తొలి వికెట్‌కి 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆకట్టుకున్నారు. అయినా రెండో వన్డేలో మార్పులు చేసింది భారత జట్టు...
కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వడంతో అతన్ని మిడిల్ ఆర్డర్‌లో ఆడించేందుకు వీలుగా, ఇషాన్ కిషన్‌ను తప్పించి... వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపించారు...
అయితే ఈ ప్రయోగం ఘోరంగా విఫలమైంది. రోహిత్ శర్మ 5 పరుగులకే పెవిలియన్ చేరగా, రిషబ్ పంత్ 34 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసి భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...
అంతేకాకుండా హిట్టింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన దీపక్ హుడాకి బదులుగా వాషింగ్టన్ సుందర్‌కి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చింది టీమ్ మేనేజ్‌మెంట్. ఈ ప్రయోగం కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు...
తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా కలిసి అజేయంగా 60+ భాగస్వామ్యం నెలకొల్పితే... రెండో వన్డేలో నాలుగో వికెట్ పడిన తర్వాత 50+ భాగస్వామ్యం నమోదుకాలేదు...
‘రిషబ్ పంత్ మంచి ఫినిషర్. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చి, చివరిదాకా ఉండి మ్యాచ్‌ను ముగించే సత్తా రిషబ్ పంత్‌కి ఉంది. అలాంటి పంత్‌ను ఓపెనర్‌గా పంపడం కరెక్ట్ కాదు...
రవీంద్ర జడేజా లేకపోవడంతో టీమిండియా ఆ ప్లేస్‌ని రిప్లేస్ చేసే ప్లేయర్ కోసం వెతుకుతున్నట్టుగా ఉంది. లోయర్ ఆర్డర్‌లో వచ్చి భారీ షాట్లు ఆడే జడేజా లేని లోటు తెలుస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్ స్పెల్‌తో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీయడం, వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో ఎలాగోలా గెలిచి, సిరీస్ దక్కించుకుంది భారత జట్టు... లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది...
ఇలాంటి ప్రయోగాలు కోహ్లీ కెప్టెన్సీలో చేసి ఉంటే, అతను కెప్టెన్‌గా పనికి రాడంటూ కామెంట్లు చేసేవారని, రోహిత్ శర్మ కావడంతో పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు విరాట్ ఫ్యాన్స్...