MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ..! ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్..

పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ..! ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్..

Rishabh Pant Car Accident: రోడ్డు ప్రమాదానికి గురై  ప్రస్తుతం డెహ్రాడూన్ లో చికిత్స పొందుతున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరోగ్యంపై కీలక అప్డేట్ వెలువడింది. అతడికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు సమాచారం. 

2 Min read
Author : Srinivas M
Published : Dec 31 2022, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తన తల్లిని సర్‌ప్రైజ్ చేయడానికని ఇంటికి వెళ్తూ కారు డివైడర్ కు ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరోగ్యానికి సంబంధించి కీలక అప్టేడ్ వెలువడింది.  రిషభ్ కు డెహ్రాడూన్ లో వైద్యులు  ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు తెలుస్తున్నది. ప్రమాదంలో పంత్  ముఖానికి  పలు గాయాలయ్యాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Rishabh Pant accident

Rishabh Pant accident

ఈ నేపథ్యంలో ఆ గాయాలకు   చిన్న ప్లాస్టిక్ సర్జరీ అవసరం వచ్చిందని.. దానిని డెహ్రాడూన్ లోనే  పూర్తి చేసినట్టు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ తెలిపారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో అతడికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్టు తెలుస్తున్నది.   

36

ఇదే విషయమై డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ మాట్లాడుతూ.. ‘డీడీసీఏ నుంచి  ఓ బృందం డెహ్రాడూన్ కు వెళ్లింది. అక్కడ పంత్ ఆరోగ్యాన్ని పరిశీలించింది.   ప్లాస్టిక్ సర్జరీ అవసరమని భావించడంతో మేం ముందుగా అతడిని ఢిల్లీకి షిఫ్ట్ చేయాలని  అనుకున్నాం. అవసరమైతే విమానం (ఎయిర్ అంబులెన్స్) ద్వారా   పంత్ ను  ఢిల్లీకి  తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాం.. 

46

కానీ  వైద్యులు  డెహ్రాడూన్ లోనే పంత్ కు  ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. దీంతో మేం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం.  ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం  బాగానే ఉంది.. ఎంఆర్ఐ స్కానింగ్ లో కూడా ఎలాంటి సమస్యా లేదని  తేలింది’ అని  చెప్పారు.  

56

ప్రస్తుతం డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ లో  పంత్ చికిత్స  జరుగుతోంది. అతడి చికిత్సకు అయ్యే ఖర్చును బీసీసీఐ భరిస్తోంది. పంత్ బీసీసీఐతో కాంట్రాక్టు  ఉన్న క్రికెటర్ అన్న విషయం తెలిసిందే.  అతడి ఆరోగ్యంపై బీసీసీఐ నిత్యం  వైద్యులతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది.  

66

ఇదిలాఉండగా ప్రమాదానికి గురైన  పంత్ తల్లితో మాట్లాడిన ప్రధాని మోడీకి బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. పంత్ కుటుంబానికి అండగా నిలిచిన ప్రధానికి ధన్యవాదాలు అని  ట్వీట్ లో రాసుకొచ్చింది. పంత్ కు అత్యుత్తమ చికిత్స అందించేందుకు  గాను ఢిల్లీకి గానీ లేదంటే ముంబైకి గానీ తరలించడానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నది. 

About the Author

SM
Srinivas M
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
టీమిండియా దెబ్బ‌కు పాకిస్థాన్ చిత్తు.. ఆసియాక‌ప్‌లో దుమ్మురేపిన అమ్మాయిలు
Recommended image2
భార‌త్ బౌలింగ్ దెబ్బ‌కు పాక్ విల‌విల‌.. 55 ప‌రుగుల‌కే కుప్పకూలిన పాకిస్థాన్ జ‌ట్టు
Recommended image3
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved