ఆడకపోయినా రిషబ్ పంత్‌పైనే ఫోకస్ అంతా... ఊర్వశి రౌతెల్లా రాకతో సోషల్ మీడియాలో...
ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. సీనియర్ దినేశ్ కార్తీక్‌కి తుది జట్టులో చోటు కల్పించిన టీమిండియా మేనేజ్‌మెంట్, పంత్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టింది. అయినా పాక్‌తో మ్యాచ్ సమయంలో రిషబ్ పంత్‌పైనే ఫోకస్ పడింది...

ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు సోషల్ మీడియా వేదికగా రిషబ్ పంత్, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెల్లా మధ్య ఓ మినీ వార్ నడిచింది. తనకోసం మిస్టర్ ఆర్‌పీ, ముంబై వచ్చి కొన్ని గంటల పాటు హోటల్ లాబీలో వెయిట్ చేశాడని, తాను రాకపోవడంతో బాగా ఫీల్ అయ్యాడని ఓ టీవీ ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది ఊర్వశి రౌతెల్లా...
Image credit: PTI
ఈ వీడియో వైరల్ కావడంతో రిషబ్ పంత్ రియాక్ట్ అయ్యాడు. పాపులారిటీ, క్రేజ్ కోసం అబద్ధాలు ఆడవద్దు అక్క... తనని వదిలేయాలంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్టు చేశాడు రిషబ్ పంత్. దీనిపై ఊర్వశి రౌతెల్లా, బ్యాటు బాల్ ఆట ఆడుకో తమ్ముడూ అంటూ రియాక్ట్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది...
భారత క్రికెటర్లకు, బాలీవుడ్ హీరోయిన్లకు మధ్య లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్ కొత్తేమీ కాదు. యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ కూడా ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారు. అయితే రిషబ్ పంత్- ఊర్వశి రౌతెల్లా ఎపిసోడ్‌లా మరీ ఓపెన్ అయిపోయి, సోషల్ మీడియాలో ఇంత రచ్చ మాత్రం ఎవ్వరూ చేయలేదు...
Image credit: Wikimedia Commons and Twitter
తాజాగా ఆసియా కప్ 2022 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కి హాజరైంది ఊర్వశి రౌతెల్లా. సరిగ్గా ఇదే మ్యాచ్‌లో రిషబ్ పంత్, తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి...
Urvashi Rautela-Rishabh Pant
ఇంతకుముందు ‘మీ ఫెవరెట్ క్రికెటర్ ఎవరు’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు... తనకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదని... క్రికెట్ మ్యాచులు కూడా చూడనని సమాధానం ఇచ్చింది ఊర్వశి రౌతెల్లా. క్రికెట్ తెలియని ఊర్వశి, బ్యాటు బాల్ గేమ్ చూడడానికి వచ్చిందని, తాను మ్యాచ్ ఆడడం మానేశాడని రిషబ్ పంత్‌ని హైలైట్ చేస్తున్నారు ట్రోలర్స్...
తన కుటుంబంతో సహా అథియా శెట్టి మ్యాచ్ చూడడానికి వచ్చిన కెఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. రిషబ్ పంత్ మాత్రం తన ఎక్స్‌కి అలాంటి ఆనందం కూడా మిగలకుండా డగౌట్ కూర్చొని ఛిల్ అయ్యాడంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి మ్యాచ్ ఆడకపోయినా ఊర్వశి రాకతో రిషబ్ పంత్ పేరు ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. టీవీలో ఊర్వశిని చూపించినప్పుడల్లా క్రికెటర్ రిషబ్ పంత్‌ని చూపించి... ఈ ఎపిసోడ్‌కి మరింత మసాలా జోడించాడు కెమెరామెన్.