ధోనీ వల్ల కాని రికార్డును క్రియేట్ చేసిన రిషబ్ పంత్... నాలుగో టెస్టులో సెంచరీతో...
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 24/1 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా, రెండో రోజు 6 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్‌ల కారణంగా ఆఖరి సెషన్‌లో పూర్తిగా టీమిండియా ఆధిపత్యం కనబర్చింది...

ఇంగ్లాండ్‌పై నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన రిషబ్ పంత్, అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. కెరీర్‌లో మూడో టెస్టు సెంచరీ బాదిన 23 ఏళ్ల సంచలనం, మహేంద్ర సింగ్ ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డును నమోదుచేశాడు...

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియాల్లో టెస్టు సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. ఇంతకుముందు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాత్రం ఈ మూడు దేశాల్లో సెంచరీలు బాదాడు... రిషబ్ పంత్‌కి స్వదేశంలో ఇదే తొలి సెంచరీ...

టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డకౌట్ కావడంతో 24/1 పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా, 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 66 బంతుల్లో ఒక్క ఫోర్‌తో 17 పరుగులు చేసిన పూజారా, జాక్ లీచ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

భారత సారథి విరాట్ కోహ్లీ 8 బంతులాడి, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో డకౌట్ కావడంతో 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఒకే టెస్టు సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ కావడం విరాట్ కోహ్లీకి ఇది రెండోసారి. ఇంతకుముందు 2014లో ఇంగ్లాండ్‌పైనే ఈ చెత్త రికార్డు సాధించాడు కోహ్లీ...

45 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన అజింకా రహానే, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 80 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి లంచ్ బ్రేక్‌కి వెళ్లింది టీమిండియా...

144 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు ముంగిట అవుట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ...

32 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, జాక్ లీచ్ బౌలింగ్‌లో ఓల్లీ పోప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 146 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్ కలిసి ఆదుకున్నారు...

ఈ ఇద్దరూ కలిసి ఏడో వికెట్‌కి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్, బెన్ స్టోక్స్, అండర్సన్ బౌలింగ్‌లో అద్భుతమైన బౌండరీలు బాదాడు...

118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేసిన రిషబ్ పంత్, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 259 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది టీమిండియా...

పంత్ అవుటైన తర్వాత కూడా దూకుడు కొనసాగించిన వాషింగ్టన్ సుందర్, టెస్టుల్లో మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 117 బంతుల్లో 8 ఫోర్లతో 60 పరుగులు చేసిన సుందర్, 34 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన అక్షర్ పటేల్ ఇద్దరూ క్రీజులో ఉన్నారు.

డామ్ బెస్ బౌలింగ్‌లో సుందర్ అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన వాషింగ్టన్‌కి అనుకూలంగా నిర్ణయం వచ్చింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోకిరు 89 పరుగుల ఆధిక్యంలో నిలిచింది టీమిండియా.