MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మురళీధరన్ 1000 వికెట్లు తీసినా, అవన్నీ నా దృష్టిలో రనౌట్లే!... బిషన్ సింగ్ బేడీ చేసిన షాకింగ్ కామెంట్స్..

మురళీధరన్ 1000 వికెట్లు తీసినా, అవన్నీ నా దృష్టిలో రనౌట్లే!... బిషన్ సింగ్ బేడీ చేసిన షాకింగ్ కామెంట్స్..

భారత మాజీ క్రికెటర్, స్పిన్నర్ బిషన్  సింగ్ బేడీ, అక్టోబర్ 23న తన 77 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. తన క్రికెట్ కెరీర్‌లో 67 టెస్టులు ఆడి 266 వికెట్లు తీసిన బిషన్ సింగ్ బేడీ, 22 టెస్టులకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు..
 

Chinthakindhi Ramu | Published : Oct 23 2023, 05:12 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Bishan Singh

Bishan Singh

15 ఏళ్ల వయసులో పంజాబ్ నుంచి ఢిల్లీకి వెళ్లిన బిషన్ సింగ్ బేడీ, 1974-75 రంజీ సీజన్‌లో 64 వికెట్లు తీశాడు. 1960-1970 దశకంలో భారత జట్టుకి ప్రధాన స్పిన్నర్‌గా వ్యవహరించిన బిషన్ సింగ్ బేడీ, ముక్కుసూటి మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నాడు..

25
Bishan Singh

Bishan Singh

370 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన బిషన్ సింగ్ బేడీ, 1560 వికెట్లు తీసి అత్యధిక ఫస్ట్ క్లాస్ తీసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐదు దశాబ్దాలు దాటినా, బిషన్ సింగ్ బేడీ రికార్డు ఇంకా చెక్కు చెదరలేదు..

35
Bishan Singh webstory

Bishan Singh webstory

60 ఓవర్ల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో 12 ఓవర్లు బౌలింగ్ చేసిన బిషన్ సింగ్ బేడీ, కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. 0.5 ఎకానమీతో బౌలింగ్ స్పెల్ నమోదు చేసిన బౌలర్ బిషన్ సింగ్ ఒక్కడే..

45
Bishan Singh webstory

Bishan Singh webstory

1976-77 సీజన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ బౌలర్ జాన్ లీవర్, బాల్‌కి వ్యాజిలెన్ రాశాడు. దీనిపై బిషన్ సింగ్ బేడీ తీవ్ర అభ్యంతరం చెప్పాడు. దీంతో తీవ్ర దుమారం రేగింది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఐసీసీ, బంతికి వ్యాజిలిన్ రాయడాన్ని నిషేధించింది. 

55
Bishan Singh webstory

Bishan Singh webstory

ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్‌ని స్పిన్ బౌలింగ్ కాదని తీవ్రంగా విమర్శించాడు బిషన్ సింగ్ బేడీ. ‘ముత్తయ్య మురళీధరన్ 1000 టెస్టు వికెట్లు తీయొచ్చు కానీ నా కంటికి అవన్నీ రనౌట్లలాగే కనిపిస్తాయి...’ అంటూ వ్యాఖ్యానించాడు బిషన్ సింగ్ బేడీ.. 

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
 
Recommended Stories
Top Stories