IND vs PAK: పాక్ పై భారత్ గెలుపు.. ఆసియా కప్ 2025 ఛాంపియన్‌గా భారత్
IND vs PAK Asia Cup 2025 Final: దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్ ఓడించి భారత్ విజేతగా నిలించింది. ఆసియా కప్ 2025 ఛాంపియన్ నిలవడంతో పాటు 9వ సారి టైటిల్ ను సాధించింది.

IND vs PAK : పాకిస్తాన్ పై భారత్ గెలుపు.. ఆసియా కప్ 2025 ఛాంపియన్ గా టీమిండియా
భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ లో మొదట ఇబ్బంది పడినా తిలక్ వర్మ, శివం దూబే అద్భుతమైన నాక్ తో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. దీంతో ఆసియా కప్ 2025 ఛాంపియన్‌గా భారత్ నిలిచింది. 9వ సారి ఆసియా కప్ టైటిల్ ను అందుకుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. మంచి ప్రారంభాన్ని సాధించినప్పటికీ, మధ్య ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడింది. 12.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి 113 పరుగులు సాధించిన తర్వాత పాక్ వరుసగా వికెట్లు కోల్పోయి కుప్పకూలిపోయింది. ఆ తర్వాత భారత్ చివరి వరకు ఆడి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది.
IND vs PAK : వరుసగా పడిన వికెట్లు
పాకిస్తాన్ జట్టుకు తొలి షాక్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 38 బంతుల్లో 57 పరుగులు చేసి ఔటయ్యడమే. తరువాత సామ్ అయ్యూబ్ 14, మొహమ్మద్ హారిస్ 0 పరుగులకే వెనుదిరిగారు. ఫఖర్ జమాన్ 35 బంతుల్లో 46 పరుగులు చేసి 15వ ఓవర్‌లో ఔటయ్యాడు. హుస్సేన్ తలత్ (1), సల్మాన్ అలీ ఆగా (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
IND vs PAK : భారత బౌలర్లు అదరగొట్టారు
భారత బౌలర్లు పూర్తి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆధిపత్యం చూపించారు. అద్భుతమైన బౌలింగ్ తో పాకిస్తాన్ ను కుప్పకూల్చారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. జస్ప్రిత్ బుమ్రా కీలకమైన 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో పాక్ చివరి 9 వికెట్లు కేవలం 33 పరుగులకే కోల్పోయింది. పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది.
IND vs PAK భారత్ తడబడి గెలిచింది
IND vs PAK ఫైనల్‌లో భారత్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ బ్యాటింగ్‌ను కూల్చారు. తక్కువ స్కోర్ తో మ్యాచ్ ను భారత నియంత్రణలోకి తీసుకొచ్చారు. తొలి వికెట్ కోసం సాధారణంగా కొంచెం ఇబ్బంది పడ్డా, తర్వాత స్పిన్నర్ల సరసన బుమ్రా, కుల్దీప్, అక్షర్, చక్రవర్తిలు సూపర్ కమ్ బ్యాక్ తో పాక్ ను దెబ్బకొట్టారు.
147 పరుగుల టార్గెట్ భారత్ బ్యాటింగ్ ను ప్రారంభించింది. ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. రెండో ఓవర్ లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్, సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. సంజూ శాంసన్ 24 పరుగుల నాక్ ఆడాడు. శివమ్ దూబే కూడా కీలకమైన 33 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు.
తిలక్ వర్మ హాఫ్ సెంచరీ నాక్ తో చివరి వరకు క్రీజులో నిలిచి భారత్ కు విజయాన్ని అందించాడు. ఆసియా కప్ 2025 ఛాంపియన్ గా భారత్ ను నిలబెట్టాడు. భారత్ చివరి ఓవర్ వరకు ఆడి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. తిలక్ వర్మ 69 పరుగులతో అజేయంగా నిలిచాడు.