- Home
- Sports
- Cricket
- ఢిల్లీకి అంత సీన్ లేదు.. ఈసారి ఫైనల్స్‌కు వెళ్లేవి ఆ రెండు జట్లే.. పాంటింగ్ షాకింగ్ కామెంట్స్
ఢిల్లీకి అంత సీన్ లేదు.. ఈసారి ఫైనల్స్‌కు వెళ్లేవి ఆ రెండు జట్లే.. పాంటింగ్ షాకింగ్ కామెంట్స్
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇంతవరకూ కప్ కొట్టని టీమ్ లలో ఢిల్లీ కూడా ఉంది. అయితే ఆ జట్టు పాంటింగ్ అభిప్రాయం ప్రకారం ఈసారి కూడా ఢిల్లీకి అంత సీన్ లేదంటున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ లీగ్ లో ఇంతవరకూ కప్ కొట్టని ఢిల్లీ ఈసారి కూడా కనీసం ఫైనల్స్ కు కూడా వెళ్లదని, టోర్నీలో తుది పోరు రాజస్తాన్ రాయల్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుందని అన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ నేటి (శనివారం) సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్ తో తొలి మ్యాచ్ ఆడుతున్న వేళ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు నిర్వహించిన ఓ సమావేశంలో పాంటింగ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాంటింగ్ మాట్లాడుతూ... ‘నా అభిప్రాయం ప్రకారం ఈసారి ఐపీఎల్-16 లో ఫైనల్స్ ఆడే జట్లు రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్. ఈ రెండు జట్లూ గతేడాది కూడా ఫైనల్స్ ఆడాయి. రాజస్తాన్ గత కొన్నాళ్లుగా నిలకడగా ఆడుతోంది. ఈ సీజన్ లో కూడా ఫైనల్ కు వెళ్లగలరని అనకుంటున్నా..’అని చెప్పాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కు హెడ్ కోచ్ గా ఉన్న రికీ పాంటింగ్.. ఫైనల్స్ కు తాను కోచింగ్ ఇస్తున్న టీమ్ కు వెళ్లదని చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఎంత చెత్త టీమ్ అయినా ఒక జట్టుకు ప్రాతినిథ్యం వహించే హెడ్ కోచ్.. తమ జట్టు రాణిస్తుందని, కప్ కూడా కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తాడు. కానీ పాంటింగ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
దీనిపై ఢిల్లీ ఫ్యాన్స్ కూడా ఒకింత నిరాశకు గురవుతున్నారు. గడిచిన నాలుగు సీజన్లలో మూడు సార్లు ప్లేఆఫ్స్ కు వెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాది కూడా మెరుగైన ప్రదర్శనలు చేయాలని భావిస్తున్నది. అందుకు తగ్గట్టుగానే నెలన్నర రోజుల నుంచి ఆటగాళ్లకు ప్రత్యేక ట్రైనింగ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేసింది.
రాజస్తాన్, గుజరాత్ లు బలమైన జట్లే అయినా ఢిల్లీ కూడా ఏమంత వీక్ గా లేదు. ఈసారి పంత్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటే అయినా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్, ఆన్రిచ్ నోర్త్జ్, అక్షర్ పటేల్, రిలీ రూసో, ముస్తాఫిజుర్ రెహ్మాన్ వంటి ఆటగాళ్లతో ఢిల్లీ జట్టు బలంగానే ఉంది. ఈ సీజన్ లో అయినా ఢిల్లీ తమ కప్పు కలను నెరవేర్చుకుంటుందో చూడాలి.