- Home
- Sports
- Cricket
- సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌లలో ఎవరు గ్రేట్... మాస్టర్ బ్లాస్టర్‌తో ఆ విషయంలో పోటీపడి...
సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌లలో ఎవరు గ్రేట్... మాస్టర్ బ్లాస్టర్‌తో ఆ విషయంలో పోటీపడి...
ఎందరు క్రికెటర్లు ఉన్నా, మరెందుకు క్రికెటర్లు పుట్టుకొస్తున్నా క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ క్రేజ్ వేరే లెవెల్. ఒకానొకదశలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా సచిన్ టెండూల్కర్‌తో పోటీ పడి పరుగులు చేశాడు...

అంతర్జాతీయ క్రికెట్‌లో 71 సెంచరీలు చేసిన రికీ పాంటింగ్, ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) తర్వాతి స్థానంలో ఉన్నాడు...
రెండేళ్ల క్రితం 70 అంతర్జాతీయ సెంచరీల మార్కును అందుకున్న విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్ రికార్డును సమం చేయడానికి దాదాపు 50 మ్యాచులుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు..
తన క్రికెట్ కెరీర్‌లో 560 మ్యాచులు ఆడిన రికీ పాంటింగ్, 146 హాఫ్ సెంచరీలతో 27,483 పరుగులు చేశాడు. ఇందులో కెప్టెన్‌గానూ నాలుగు ఐసీసీ ట్రోపీలు గెలిచాడు రికీ పాంటింగ్...
100+ టెస్టు విజయాలు అందుకున్న ఒకే ఒక్క ప్లేయర్‌గా నిలిచిన రికీ పాంటింగ్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రికెట్ కెప్టెన్‌గా అందనంత ఎత్తులో నిలిచాడు...
ఎవ్వరికైనా కెప్టెన్సీ, స్వేచ్ఛగా ఆడడానికి అడ్డంకిగా, నాయకత్వ బాధ్యతలు భారంగా భావించేవాళ్లు. అయితే రికీ పాంటింగ్ మాత్రం అలా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు... కెప్టెన్‌గా విజయాలు అందుకుంటూనే బ్యాటర్‌గానూ సూపర్ సక్సెస్ అయ్యాడు.
అందుకే కెప్టెన్‌గా ఉన్నప్పుడే మరింత మెరుగ్గా బ్యాట్స్‌మెన్‌గా రాటుతేలాడు. అందుకే సచిన్ టెండూల్కర్ కంటే మెరుగ్గా గెలిచిన మ్యాచుల్లో 20,140 పరుగులు చేశాడు రికీ పాంటింగ్. సచిన్ టెండూల్కర్ 17,113 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు...
అత్యధిక విజయాల్లో భాగం పంచుకున్న ప్లేయర్‌గానూ టాప్‌లో ఉన్నాడు రికీ పాంటింగ్. రికీ పాంటింగ్ 377 విన్నింగ్ మ్యాచుల్లో ఆడితే, జయవర్థనే 336 మ్యాచులతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 307 మ్యాచులతో మూడో స్థానంలో ఉన్నాడు.
సచిన్ టెండూల్కర్ ప్రత్యర్థిగా అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్‌గానూ నిలిచాడు రికీ పాంటింగ్. రికీ పాంటింగ్, సచిన్ ప్రత్యర్థులుగా 84 మ్యాచుల్లో తలబడ్డారు. సనత్ జయసూర్య 78 మ్యాచులతో రెండో స్థానంలో ఉన్నాడు...
సచిన్ టెండూల్కర్‌తో పాటు పరుగులు చేయడంలో సనత్ జయసూర్య, బ్రియాన్ లారా, రికీ పాంటింగ్ వంటి ప్లేయర్లు పోటీపడ్డారు. అయితే మాస్టర్ బ్యాట్స్‌మెన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు...
అయితే అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గానూ రికీ పాంటింగ్ అందుకున్న విజయాలు వేరు. కెప్టెన్‌గానే కాకుండా కోచ్‌గా, మెంటర్‌గానూ రికీ పాంటింగ్ సూపర్ సక్సెస్ అందుకుంటున్నాడు...
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు పృథ్వీషా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ సక్సెస్‌లో రికీ పాంటింగ్‌కి కూడా భాగం ఉంది. ముఖ్యంగా రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టైల్‌ను దగ్గర్నుండి గమనిస్తే, రికీ పాంటింగ్ టెక్నిక్ కనిపిస్తుంది...
200 టెస్టులు ఆడిన సచిన్ టెండూల్కర్, 53.78 సగటుతో 15,921 పరుగులు చేస్తే, 168 టెస్టులు ఆడిన రికీ పాంటింగ్ 51.85 సగటుతో 13,378 పరుగులు చేశాడు. క్రికెట్‌లో ఆల్‌టైం లెజెండ్స్‌గా గుర్తింపు పొందిన ఈ ఇద్దరూ కూడా టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ మార్కు అందుకోలేకపోవడం విశేషం.