MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • RCB vs PBKS: ఐపీఎల్ లో ఆర్సీబీకి మళ్లీ షాక్.. స్వింగ్ మాస్టర్ చరిత్ర సృష్టించాడు

RCB vs PBKS: ఐపీఎల్ లో ఆర్సీబీకి మళ్లీ షాక్.. స్వింగ్ మాస్టర్ చరిత్ర సృష్టించాడు

IPL 2025 RCB vs PBKS: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. అద్భుతమైన ఆటతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ను వారి సొంత గ్రౌండ్ లో ఓడించింది. హైదరాబాద్‌లో 245 పరుగులను కాపాడుకోలేకపోయిన పంజాబ్.. ఆ త‌ర్వాత అద్భుతంగా విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. ఆర్సీబీపై గెలుపుతో పంజాబ్ టీమ్ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలోకి చేరుకుంది.   

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 19 2025, 01:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

IPL 2025 RCB vs PBKS: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు-పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో వర్షం విలన్‌గా మారింది. చాలా సేపు వ‌ర్షం ప‌డ‌టంలో మ్యాచ్ జ‌ర‌గ‌దేమో అనే సందేహాలు వ‌చ్చాయి. అయితే, ఇరు జ‌ట్ల అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. ఈ మ్యాచ్ 14-14 ఓవర్ల మ్యాచ్ గా జ‌రిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

టాస్ గెలిచిన పంజాబ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. మొద‌ట బ్యాటింగ్ కు దిగింది ఆర్సీబీ. అయితే, పంజాబ్ కింగ్ అర్ష్‌దీప్ సింగ్ ఆకలితో ఉన్న సింహంలా ఆర్సీబీపై విరుచుకుప‌డ్డాడు. అలాగే, చాహల్, బ్రార్, జాన్సెన్ రాణించడంతో ఆర్సీబీ వ‌రుస‌గా వికెట్లు స‌మ‌ర్పించుకుని 95/9 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆర్సీబీ  ఇన్నింగ్స్ లో టిమ్ డేవిడ్ 50 ప‌రుగుల సునామీ ఇన్నింగ్స్ ను ఆడాడు.

34

ఈజీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ టీమ్ కు మంచి ఆరంభం ల‌భించింది. నేహల్ వధేరా 33 పరుగుల అజేయ ఇన్నింగ్ తో 12.1 ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులతో విజయాన్ని అందుకుంది.

44

6 ఏళ్లలో చరిత్ర సృష్టించిన అర్ష్ దీప్ సింగ్

అర్ష్‌దీప్ సింగ్ 2019 సంవత్సరంలో తొలిసారి పంజాబ్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. పంజాబ్ తరపున ఆడుతూ కేవలం 6 సంవత్సరాలలోనే అతను చరిత్ర సృష్టించాడు. ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

ఆర్సీబీపై ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసిన త‌ర్వాత అత‌ను ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ మ్యాచ్ లో అత‌ను ఫిల్ సాల్ట్, కోహ్లీల‌ను పెవిలియన్ కు పంపాడు. పంజాబ్ తరఫున అర్ష్‌దీప్ ఇప్పటివరకు 86 వికెట్లు పడగొట్టాడు. ఈ జట్టు తరఫున పియూష్ చావ్లా 84 వికెట్లు పడగొట్టాడు. మూడో స్థానంలో సందీప్ శర్మ  ఉండ‌గా, అతను 73 వికెట్లు పడగొట్టాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved