MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • RCB vs DC: కొనసాగుతోన్న బెంగళూరు జోరు.. 8 వికెట్ల తేడాతో భారీ విజయం. ఒంటి చేత్తో గెలిపించిన స్మృతి

RCB vs DC: కొనసాగుతోన్న బెంగళూరు జోరు.. 8 వికెట్ల తేడాతో భారీ విజయం. ఒంటి చేత్తో గెలిపించిన స్మృతి

ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ 2025లో బెంగళూరు జోరు కొనసాగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 142 పరుగుల లక్ష్యాన్ని రాయల్‌ ఛాలెంజర్స్ సునాయాసంగా చేధించింది. కెప్టెన్ స్మృతి మందన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించింది..  

3 Min read
Author : Narender Vaitla
| Updated : Feb 17 2025, 11:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
RCB won

RCB won

ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని చేధించి సంచలన విజయాన్ని అందుకున్న బెంగళూరు రెండో మ్యాచ్‌లోనూ విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 47 బంతుల్లో 81 పరుగులు చేసిన స్మృతి మందన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.   

142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్‌ ఛాలెంజ్‌ బెంగళూరు మొదటి నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్స్ 107 పరుగులతో మంచి ప్రారంభాన్ని అందించారు. స్మృతి మంధాన, డానియేల్ వ్యాట్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలోనే 107 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడింది. డానియేల్ వ్యాట్‌ 42 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అవుట్‌ అయ్యింది. 33 బంతుల్లో 42 పరుగులు చేసిన డానియేల్‌ అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో జెమిమా రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. స్మృతి మందన 81 పరుగులు చేసి అవుట్‌ అయ్యింది. శిఖా పాండే బౌలింగ్‌లో అరుంధతికి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యింది. 
 

24
RCB won the match

RCB won the match

అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌లో రెండవ బంతికే తొలి వికెట్‌ను కోల్పోయింది. రేణుకా సింగ్‌ బౌలింగ్‌లో స్మృతి మంధానకు క్యాచ్‌ ఇచ్చి షఫాలి వర్మ వర్మ వెనుదిగిరింది. ఆ తర్వాత జెమిమా రోడ్రిగ్స్‌ డీసీ స్కోర్‌ బోర్డును పెరుగులు పెట్టించింది. 22 బంతుల్లో 34 పరుగులు చేసిన తర్వాత 6.5 బంతికి రిచా ఘోష్‌ చేతిలో స్టంప్‌ అవుట్‌ అయ్యింది. వెంటనే 7.3 బంతికి డీసీ మరో వికెట్‌ కోల్పోయింది డీసీ. కిమ్‌ గార్త్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ మెగ్‌ లానింగ్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద ఉన్న ఎలిస్‌ పెరీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టింది. మెగ్‌ లానింగ్‌ 19 బంతుల్లో 17 పరుగులు చేసింది. 

వరుసగా రెండు వికెట్లు పడ్డ తర్వాత క్రీజులో ఉన్న అనాబెల్ సథర్లాండ్, యారిజాన్నే కాప్‌ స్కోర్‌ను పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. 17 బంతుల్లో 22 పరుగుల పాట్నర్‌షిప్‌ను అందించారు. అంతా సెట్‌ అవుతోందని అనుకుంటున్న సమయంలో అనాబెల్‌ 19 పరుగుల వద్ద రేణుకా సింగ్‌ బౌలింగ్‌లో స్మృతి మందనకు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యింది. ఆ తర్వాత వెంటనే జెస్ జోనాసెన్ రూపంలో డీసీ మరో వికెట్ కోల్పోయింది. కేవలం 1 పరుగుకే ఏక్తా బిష్త్‌ బౌలింగ్‌లో కనికాకు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యింది. 

34
RCB won the match

RCB won the match

దీంతో ఢిల్లీ జంటు 100 పరుగుల లోపే 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత 13.3 బంతికి డీసీ మరో వికెట్‌ కోల్పోయింది. మారిజాన్నే కాప్‌ ఏక్తా బిష్త్‌ బౌలింగ్‌లో వ్యాడ్‌ హాడ్జ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. 19 బంతుల్లో 23 పరుగులు చేసి స్కోర్‌ బోర్డ్‌ పెంచే పనిలో పడ్డ సారా బ్రైస్‌ వేర్‌హామ్‌ బౌలింగ్‌లో స్టాంప్‌ అవుట్ అయ్యింది. ఆ తర్వాత వెంటనే రాధా యాదవ్‌ క్యాచ్‌ ఇచ్చింది. ఇక చివరి వికెట్‌గా అరుధంతి రెడ్డి కిమ్‌ గార్త్‌ బౌలింగ్‌లో ఎలిస్‌ పెరీకి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యింది. దీంతో ఢిల్లీ క్యాపిటాల్స్‌ 141కి అలౌట్‌ అయ్యింది. జెమీమా రోడ్రిగ్స్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 
 

44
RCB won the match

RCB won the match

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు (XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సథర్లాండ్, జెస్ జోనాసెన్, మారిజాన్నే కాప్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, మిన్ను మాణి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు (XI):

స్మృతి మంధాన (కెప్టెన్), డానియేల్ వ్యాట్-హాడ్జ్, ఎలిస్ పెరీ, రాఘవి బిస్ట్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), కనికా అహుజా, జార్జియా వేర్‌హామ్, కిమ్ గార్త్, ఏక్తా బిష్త్, జోషిత వీజే, రేణుకా ఠాకూర్ సింగ్.
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: హ్యారీ బ్రూక్ vs సూర్యకుమార్ యాదవ్‌.. టీ20 వరల్డ్ కప్‌లో అసలేం జరుగుతోంది?
Recommended image2
PAK vs ENG : పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఇంగ్లాండ్.. సెమీస్ బెర్త్ ఫిక్స్
Recommended image3
India vs Zimbabwe : తిలక్ అవుట్.. సంజూ ఇన్! సూపర్ 8లో భారత్ సెన్సేషనల్ ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved