IPL 2020: విరాట్ కోహ్లీ సేనకు భారీ షాక్... నవ్‌దీప్ సైనీకి గాయం...
IPL2020: ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన ఇస్తూ ప్లేఆఫ్ రేసుకి చేరువైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్‌లో మిగిలిన పీడ కలను మరిచిపోయి, అద్భుతంగా ఆడుతూ టైటిల్ ఫెవరెట్‌గా నిలిచింది. అయితే ప్లేఆఫ్ చేరువైన సమయంలో ఆర్‌సీబీకి ఊహించని షాక్ తగిలింది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ నవ్‌దీప్ సైనీ కుడి చేతికి గాయమైంది...
సైనీ కుడి చేతి బొటన వేలికి గాయమై, ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు...
సైనీ బొటనవేలు, చూపుడు వేలు మధ్యలో బంతి బలంగా తగలడంతో చీలక వచ్చిందని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు ఆర్‌సీబీ ఫిజియో ఇవాన్.
‘సైనీ కుడి చేతికి తీవ్రంగా గాయమైంది. అయితే మా దగ్గర మంచి సర్జన్ అందుబాటులో ఉన్నాడు. సైనీ చేతికి కుట్లు వేశాడు సర్జన్. రాత్రంతా గాయాన్ని పర్యవేక్షించాం... వచ్చే మ్యాచ్‌లో అతడు ఆడతాడో లేదో అనేది ఇంకా క్లారిటీ రాలేదు’ అని చెప్పాడు ఫిజియో.
నాలుగేళ్ల క్రితం విరాట్ కోహ్లీకి కూడా ఇలాంటి గాయమై తగిలింది. అప్పుడు కూడా సర్జన్ కుట్లు వేసి, బ్లీడింగ్‌ను ఆపాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ కూడా చేశాడు...
ఇప్పటిదాకా జరిగిన 11 మ్యాచుల్లో 5 వికెట్లు మాత్రమే తీసిన నవ్‌దీప్ సైనీ, మంచి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
సిక్స్ ప్యాక్ బాడీతో మెరిసే నవ్‌దీప్ సైనీ... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వేసేందుకు సైనీకే బంతి ఇచ్చాడు విరాట్ కోహ్లీ.
సూపర్ ఓవర్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చిన నవ్‌దీప్ సైనీ, పోలార్డ్ వికెట్ తీశాడు.
కీలక మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పరుగులను నియంత్రించేందుకు నవ్‌దీప్ సైనీ జట్టులో ఉండడం అత్యంత అవసరం.
ఐపీఎల్ తర్వాత జరగబోయే ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు సిరీస్‌కు కూడా సైనీ పేరును పరిగణనలోకి తీసుకుంటున్నారు సెలక్టర్లు. ఈ టైమ్‌లో సైనీ గాయం ఆసీస్ టూర్ ఎంపికపై కూడా ప్రభావం చూపనుంది.