MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రిటైర్మెంట్ ప్రకటించిన డాన్ క్రిస్టియన్... అక్కడ లక్కీ స్టార్! ఐపీఎల్‌లో మాత్రం అలా...

రిటైర్మెంట్ ప్రకటించిన డాన్ క్రిస్టియన్... అక్కడ లక్కీ స్టార్! ఐపీఎల్‌లో మాత్రం అలా...

ఆస్ట్రేలియా వెటరన్ ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. బిగ్ బాష్ లీగ్ 2022-23 సీజన్‌తోనే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు స్టేట్‌మెంట్ ద్వారా తెలియచేశాడు. 39 ఏళ్ల డాన్ క్రిస్టియన్ తన కెరీర్‌లో 405 టీ20 మ్యాచులు ఆడి 5809 పరుగులు, 280 వికెట్లు తీశాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 21 2023, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బిగ్‌ బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరీకేన్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ టీమ్స్ తరుపున ఆడిన డాన్ క్రిస్టియన్ ప్రస్తుతం సిడ్నీ సిక్సర్ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా తరుపున 23 టీ20 మ్యాచులు, 20 వన్డేలు ఆడాడు క్రిస్టియన్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

‘బీబీఎల్ సీజన్ ముగిసిన తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా. హారికేన్స్‌తో మ్యాచ్ తర్వాత ఫైనల్స్ ఆడబోతున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు డాన్ క్రిస్టియన్...

39

2020-21 సీజన్‌లో 271 పరుగులు, 15 వికెట్లు తీసి సిడ్నీ సిక్సర్స్‌కి టైటిల్ అందించిన డాన్ క్రిస్టియన్, అంతకుముందు 2018-19 సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కి టైటిల్ అందించాడు... టీ20 లీగుల్లో డానియల్ క్రిస్టియన్ చాలా స్పెషల్ ప్లేయర్... ఇప్పటిదాకా అతను ఆడిన టీ20 లీగ్‌లన్నింటిలో దాదాపు అన్నింట్లోనూ తన జట్లకి టైటిల్ అందించాడు క్రిస్టియన్...

49

2010లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్, 2011లో టీ20 బిగ్‌బాష్, 2013లో బీబీఎల్2, 2017లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్, 2017లో సీపీఎల్, 2018లో ఎస్‌ఏ సూపర్ లీగ్, 2019లో బీబీఎల్8, 2020లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్ టైటిల్ అందుకున్న జట్లలో సభ్యుడిగా ఉన్నాడు డానియల్ క్రిస్టియన్...

59

లీగ్ క్రికెట్‌లో లక్కీ స్టార్ అయినా డాన్ క్రిస్టియన్ ఐపీఎల్‌లో టైటిల్ గెలవలేకపోయాడు... ఆరంభంలో డెక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పూణె జెయింట్స్, ఢిల్లీ డెర్‌డెవిల్స్ తరుపున ఆడిన డాన్ క్రిస్టియన్, ఐపీఎల్‌లో 49 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. వీటిల్లో 460 పరుగులు చేసిన క్రిస్టియన్ 38 వికెట్లు పడగొట్టాడు...

69
Dan Christian

Dan Christian

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడిన డాన్ క్రిస్టియన్, విరాట్ కోహ్లీపై అనుచిత వ్యాఖ్యలు చేసి సంచలనం క్రియేట్ చేశాడు. ‘విరాట్ కోహ్లీకి ఐపీఎల్ కంటే ఎక్కువగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మీదే మనసు ఎక్కువగా ఉంది. దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు.

79

ప్రతీ మ్యాచ్‌కి ముందు ఆర్‌సీబీ టీమ్ ప్లానింగ్ కోసం మీటింగ్స్ పెడుతూ ఉంటుంది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ సమావేశాలకు హాజరుకాడు. చాలా మీటింగ్స్‌ అతను లేకుండానే జరుగుతాయి...’ అంటూ వ్యాఖ్యానించాడు డాన్ క్రిస్టియన్...

89

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఆడిన ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడింది. ఈ మ్యాచ్‌లో బ్యాటుతో, బాల్‌తో అట్టర్ ఫ్లాప్ అయిన డాన్ క్రిస్టియన్, రవీంద్ర జడేజా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని జారవిడిచాడు...

99

ఈ సంఘటన తర్వాత డాన్ క్రిస్టియన్‌నీ, అతని భార్యని బూతులు తిడుతూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు ఆర్‌సీబీ ఫ్యాన్స్. డాన్ క్రిస్టియన్ పెట్టిన ఇన్‌స్టా పోస్టుల కింద ఘోరమైన కామెంట్లు చేశారు. దీనిపైన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన డాన్ క్రిస్టియన్, 2022 ఐపీఎల్ మెగా వేలానికి దూరంగా ఉన్నాడు.. 
 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Ira Aery : క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్‌రౌండర్.. ఈ ముక్కుపుడక సుందరి ఎవరో తెలిస్తే షాకవుతారు !
Recommended image2
Women's T20 World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్ మధ్యలోనే స్టార్ ప్లేయర్ అవుట్.. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన ఆర్సీబీ బ్యూటీ !
Recommended image3
India Highest ODI Scores : పిచ్ ఏదైనా బాదుడే.. వన్డేల్లో భారత్ క్రియేట్ చేసిన మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved