ఆర్‌సీబీ మళ్లీ అదే పాత కథ... వరుణ్ చక్రవర్తి మ్యాజిక్‌తో విరాట్ సేన కుదేలు...
IPL2021: ఆర్‌సీబీ అదరగొడుతున్నది ఆశించిన ప్రతీసారి ఏం జరుగుతుందో, మళ్లీ అదే జరిగింది. ఐపీఎల్ ఫేజ్ 2ని ఘనంగా ఆరంభించాలని భావించిన రాయల్ ఛాలెంజర్స్‌కి కేకేఆర్ బౌలర్లు ఊహించని షాక్ ఇచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... 19 ఓవర్లలో పరుగులకి 92 ఆలౌట్ అయ్యింది...

రెండో ఓవర్‌లో విరాట్ కోహ్లీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి, ఆర్‌సీబీకి తొలి బ్రేక్ అందించాడు ప్రసిద్ధ్ కృష్ణ. కోహ్లీ రివ్యూ తీసుకున్నా, రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు కనిపించడంతో ఫలితం దక్కలేదు..
ఆ తర్వాత దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 20 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, ఫర్గూసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 16 పరుగులు చేసిన ఆరంగ్రేట ఆటగాడు శ్రీకర్ భరత్‌ను అవుట్ చేసిన ఆండ్రూ రస్సెల్, అదే ఓవర్‌లో ఏబీ డివిల్లియర్స్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు...
ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన విదేశీ ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ తర్వాతి స్థానంలో నిలిచాడు ఏబీ డివిల్లియర్స్. మ్యాక్స్‌వెల్ 11 సార్లు డకౌట్ కాగా, ఏబీడీకి ఇది 10వ డకౌట్... 6వ గోల్డెన్ డకౌట్...
డివిల్లియర్స్ అవుటైన తర్వాత పరుగులు రావడం కష్టమైపోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన గ్లెన్ మ్యాక్స్‌వెల్ 17 బంతుల్లో 10 పరుగులు చేసి... వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...
ఆ తర్వాతి బంతికే వానిందు హసరంగను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు వరుణ్ చక్రవర్తి. 17 బంతుల్లో 7 పరుగులు చేసిన సచిన్ బేబీ కూడా చక్రవర్తి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
వెంటవెంటనే వికెట్లు పడడంతో 66 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్... ఆ తర్వాత కూడా ఆర్‌సీబీ బ్యాడ్‌లక్ వెంటాడింది...
హర్షల్ పటేల్ ఆడిన షాట్, వరుణ్ చక్రవర్తి చేతిని తాకుతూ నాన్‌స్ట్రైయికింగ్ ఎండ్‌లో వికెట్లను తాకింది. దీంతో 12 బంతుల్లో 4 పరుగులు చేసిన కేల్ జెమ్మీసన్ రనౌట్‌గా వెనుదిరిగాడు...
10 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన హర్షల్ పటేల్, ఫర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో 83 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి, ఆర్‌సీబీని దెబ్బతీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో వరుణ్ చక్రవర్తి ఖాతాలో చేరింది...
ఆఖర్లో మహ్మద్ సిరాజ్ 8 పరుగులు, చాహాల్ 2 పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...