MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • WI vs IND: భారత జట్టుకు వరుస షాకులు.. జడేజాకు గాయం.. సిరీస్ కు డౌటే..?

WI vs IND: భారత జట్టుకు వరుస షాకులు.. జడేజాకు గాయం.. సిరీస్ కు డౌటే..?

WI vs IND:ఇంగ్లాండ్ తో మూడో వన్డే సందర్భంగా జడేజాకు ఎడమ కాలి మోకాలి గాయం తిరగబెట్టినట్టు తెలుస్తున్నది. దీంతో అతడు అప్పట్నుంచి అసౌకర్యంగానే ఉంటున్నాడని జట్టు వర్గాలు తెలిపాయి.

2 Min read
Author : Srinivas M
Published : Jul 22 2022, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వెస్టిండీస్ తో సిరీస్ కు ముందే భారత జట్టుకు వరుస షాకులు తాకుతున్నాయి. శుక్రవారం ప్రారంభం కావాల్సిన తొలి వన్డేకు ముందే భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా నియమితుడైన జడేజా గాయంతో తొలి వన్డే ఆడేది అనుమానంగానే ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టీమిండియా రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ల గైర్హాజరీతో భారత జట్టు విండీస్ టూర్ లో  కెప్టెన్ గా శిఖర్ ధావన్, వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజాలను నియమించింది. అయితే వీరిలో తాజాగా జడేజాకు గాయమైనట్టు తెలుస్తున్నది. 

37

ఈ ఏడాది  ప్రారంభం నుంచి గాయాలతో బాధపడుతున్న జడేజా..  తాజాగా విండీస్ సిరీస్ కు ముందు కూడా గాయపడ్డాడు. జడేజా.. గతేడాది డిసెంబర్ లో న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతూ గాయపడ్డాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేదు. 

47
Ravindra Jadeja

Ravindra Jadeja

కొద్దిరోజుల విరామం తర్వాత ఐపీఎల్ ఆడినా  చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన చివరి నాలుగు మ్యాచులలో కనిపించలేదు.  గాయం కారణంగానే జడేజా ఐపీఎల్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపికైన జడ్డూ.. అక్కడ టెస్టుతో పాటు 2 టీ20లు, మూడు వన్డేలు ఆడాడు. 

57

అయితే ఇంగ్లాండ్ తో మూడో వన్డే సందర్భంగా జడేజాకు ఎడమ కాలి మోకాలి గాయం తిరగబెట్టినట్టు తెలుస్తున్నది. దీంతో అతడు అప్పట్నుంచి అసౌకర్యంగానే ఉంటున్నాడని జట్టు వర్గాలు తెలిపాయి. ఇక విండీస్ తో వన్డే సిరీస్ కు ముందు మళ్లీ అదే నొప్పి తిరగబెట్టడంతో అతడు తొలి వన్డే నుంచి తప్పుకున్నట్టు తెలుస్తున్నది. 

67

జడేజా తొలి వన్డే ఒక్కడే తప్పుకుంటాడా..? లేక మొత్తం వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటాడా..? అన్నది మాత్రం తేలాల్సి ఉంది. జడేజా మాత్రం మొత్తం వన్డే సిరీస్ నుంచి తప్పుకుని తిరిగి టీ20 లలో ఆడాలని భావిస్తున్నాడని తెలుస్తున్నది. 
 

77

జడేజాకు గాయం కావడంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు..? వైస్ కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనేది తేలాల్సి ఉంది.  శుక్రవారం రాత్రి 7 గంటలకు విండీస్ తో తొలి వన్డే ప్రారంభమవుతుంది. 

About the Author

SM
Srinivas M
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ.. మరి హార్దిక్ పాండ్యా సంగతేంటి?
Recommended image2
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image3
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved