MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • కీలక పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్..? సౌతాఫ్రికా టూర్ కు ఆ నలుగురు క్రికెటర్లు దూరం..!

కీలక పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్..? సౌతాఫ్రికా టూర్ కు ఆ నలుగురు క్రికెటర్లు దూరం..!

India Tour Of South Africa: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్..? కీలక టూర్ కు ముందు నలుగురు కీ ప్లేయర్లు ఈ  టూర్ కు  దూరం కానున్నట్టు  సమాచారం. గాయాల కారణంగా ఆ నలుగురు ఆటగాళ్లు.. సౌతాఫ్రికా టూర్ కు దూరంగా ఉండే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 08 2021, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

త్వరలో దక్షిణాఫ్రికాకు వెళ్లనున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.  కీలక పర్యటనకు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్నది. సౌతాఫ్రికా టూర్ కు ముందు భారత జట్టులోని నలుగురు ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్, స్పిన్నర్ అక్షర్ పటేల్, పేసర్ ఇషాంత్ శర్మ. ఈ నలుగురు ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు. 

310

ఇటీవలే న్యూజిలాండ్ తో ముగిసిన రెండో టెస్టులో గాయం కారణంగా రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మలు తప్పుకున్న విషయం తెలిసిందే. కాన్పూర్ టెస్టులో ఆడిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు గాయాలయ్యాయి. జడేజా కుడి ముంజేతికి గాయమైంది. ఈ క్రమంలో అతడికి  వైద్య పరీక్షలు నిర్వహించగా.. గాయం తీవ్రతరం కావడంతో అతడికి విశ్రాంతినిచ్చారు. 

410

ఒకవేళ అతడు శస్త్ర చికిత్స కు వెళ్లాల్సి వస్తే అది భారత జట్టుకు భారీ షాకే.  వచ్చే ఐపీఎల్ సీజన్ లో కూడా అతడు పాల్గొనే అవకాశం ఉండదు. జాతీయ జట్టుకు కూడా సుదీర్ఘకాలం పాటు విశ్రాంతినివ్వాల్సిందే. 

510

అతడితో పాటు  ఓపెనర్ శుభమన్ గిల్ కూడా కాలి గాయంతో బాధపడుతున్నాడు. అతడు కూడా సౌతాఫ్రికాకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఆగస్టులో ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా గిల్.. ఇదే  గాయంతో పర్యటన నుంచి తప్పుకున్నాడు. దీంతో భారత జట్టు.. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తో ఓపెనింగ్ చేయించాల్సి వచ్చింది. 

610

ఈ ఇద్దరే గాక.. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతడు కూడా సిరీస్ కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముంబై టెస్టులో అతడు ఆడకపోవడంతో జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్  ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 

710

మరోవైపు స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా స్ట్రెస్ రియాక్షన్ (కీళ్ల నొప్పులు)తో బాధపడుతున్నాడు. అతడిని పరీక్షించిన వైద్యులు.. అక్షర్ కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో అతడు కూడా సౌతాఫ్రికా టూర్ కు అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉంది. 

810

కీలక ఆటగాళ్లు దూరమవుతుండటంతో జట్టు ఎంపిక కూడా ఆలస్యమయ్యే అవకాశమ కనిపిస్తున్నది. ఒకవేళ ఈ నలుగురు  పర్యటనకు వెళ్లకుంటే.. ఇప్పటికే సౌతాఫ్రికా లో అనధికారిక టెస్టులు ఆడుతున్న  ఇండియా-ఏ లోని షాబాజ్ నదీం, సౌరభ్ కుమార్ ను అక్కడే ఉండాల్సిందిగా బీసీసీఐ ఆదేశించనుంది. 

910

ఇక వారం రోజుల పాటు ఆలస్యంగా దక్షిణాఫ్రికాకు వెళ్లనున్న టీమిండియా.. ఈనెల 16న ముంబై నుంచి బయల్దేరే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లను ముంబైకి రమ్మన్న బీసీసీఐ.. వారిని  బయో బబుల్ లో ఉండాలని ఆదేశించింది. 12 నుంచి బయో బబుల్ లో ఉండే ఆటగాళ్లు.. 16న సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కనున్నారు. 

1010

భారత పర్యటన నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఇప్పటికే 21 మందితో కూడిన టెస్టు జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 26న తొలి టెస్టు మొదలుకానున్నది.  

About the Author

SG
Sreeharsha Gopagani
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved