MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • Ravindra Jadeja: చెన్నైతో జడ్డూ బ్రేకప్ ఖాయమే..! ఐపీఎల్-15 తర్వాత ఫ్రాంచైజీతో కటీఫ్..

Ravindra Jadeja: చెన్నైతో జడ్డూ బ్రేకప్ ఖాయమే..! ఐపీఎల్-15 తర్వాత ఫ్రాంచైజీతో కటీఫ్..

Ravindra Jadeja: టీమిండియా ఆల్ రౌండర్, ఐపీఎల్ లో దశాబ్దం పాటు చెన్నై సూపర్ కింగ్స్ తో కొనసాగుతున్న రవీంద్ర జడేజా.. సీఎస్కేకు  బ్రేకప్ చెప్పినట్టేనా..?  ఇక అతడు వచ్చే సీజన్ లో వేరే ఫ్రాంచైజీకి వెళ్లనున్నాడా..?  

2 Min read
Author : Srinivas M
| Updated : Aug 15 2022, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ravindra Jadeja

Ravindra Jadeja

గత కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉంటున్న రవీంద్ర జడేజా-చెన్నై సూపర్ కింగ్స్ ల వ్యవహారం  దాదాపు ముగింపునకు చేరుకున్నట్టే కనిపిస్తున్నది. చెన్నైతో తెగదెంపులు చేసుకోవడానికే జడ్డూ  చూస్తున్నాడట. ఐపీఎల్-15 ముగిసినప్పట్నుంచి ఆ ఫ్రాంచైజీతో టచ్ లో లేడని, వచ్చే ఏడాది అతడు సీఎస్కేతో ఆడటం కష్టమే అని అతడి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం మేరకు.. 2022 ఐపీఎల్ ముగిసిన తర్వాత జడేజా-సీఎస్కేతో టచ్ లో లేడు. ఆన్లైన్ లో గానీ ఆఫ్ లైన్ లో గానీ జడేజా..  చెన్నైతో కనెక్ట్ కాలేదని అతడి  సన్నిహితుడొకరు తెలిపాడు.  తనను కెప్టెన్ గా చేసి  తర్వాత  అర్థాంతరంగా తీసేసినందుకు గాను జడేజా.. ఫ్రాంచైజీ మీద గుర్రుగా ఉన్నాడని  కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

36

ఇక ఇప్పుడు అవే వార్తలను నిజం చేస్తూ జడేజా ఫ్రాంచైజీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయించుకున్నట్టు  సమాచారం. ఐపీఎల్-15 కు నాలుగు రోజుల ముందు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాడు. అయితే  జడేజా సారథిగా ఉన్న 8 మ్యాచుల్లో చెన్నై 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది.  దీంతో అతడిని కెప్టెన్ గా తప్పించింది సీఎస్కే. 

46

అప్పుడే జడేజా-చెన్నై యాజమాన్యం మధ్య విబేధాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి.  ఈ సీజన్ లో చెన్నై ఆడిన చివరి నాలుగు మ్యాచులు జడేజా ఆడలేదు. గాయం కారణంగా అతడు సీజన్ నుంచి  తప్పుకున్నాడు.  ఆ తర్వాత అతడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లోని రీహాబిటేషన్ సెంటర్ లో చికిత్స పొందాడు. అయితే తన గాయం గురించిన సమాచారాన్ని కూడా జడ్డూ.. చెన్నై ప్రతినిధులకు తెలియజేయలేదట.  

56

ఇక ఆ తర్వాత జడ్డూ.. తన ఇన్స్టాగ్రామ్ లో  చెన్నైకి సంబంధించిన పోస్టులను డిలీట్ చేయడం.. ధోని బర్త్ డే  సందర్భంగా చెన్నై విడుదల చేసిన వీడియోలో జడ్డూ కనిపించకపోవడంతో  విబేధాలు నిజమే అని ఫ్యాన్స్ కూడా భావించారు. 

66

ఇంత జరుగుతున్నా చెన్నై మాత్రం తమ మధ్య ఎలాంటి విబేధాలూ లేవని.. వచ్చే సీజన్ లో కూడా జడేజా తమతోనే ఆడతాడని బుకాయిస్తుండటం గమనార్హం.  చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు.. అనే ధైర్యంతో చెన్నై ఉంది. కానీ జడ్డూ మాత్రం ఇప్పటికే  చెన్నై నుంచి అనధికారికంగా దూరంగా ఉంటూ వచ్చే ఐపీఎల్ లో మరో జట్టు తరఫున ఆడేందుకు  రూట్ క్లీయర్ చేసుకుంటున్నాడని టాక్. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved