అసలు సమస్య రవీంద్ర జడేజాతోనే! 10 ఏళ్లుగా స్వదేశంలో హాఫ్ సెంచరీ లేదు, వికెట్లు తీసినా...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు భారత బ్యాటర్లు అందరూ సూపర్ ఫామ్‌లోకి వచ్చేశారు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ అంతా మంచి ఫామ్‌లో ఉన్నారు..
ఇషాన్ కిషన్ కూడా మిడిల్ ఆర్డర్‌లోనూ ఆడగలనని నిరూపించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాక్ టు బ్యాక్ వన్డే హాఫ్ సెంచరీలు చేసి నిరూపించుకున్నాడు.. బౌలర్లు కూడా అదరగొట్టారు..
జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా చక్కని బౌలింగ్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. రిజర్వు ప్లేయర్లుగా ఎంపికైన రవి అశ్విన్, వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నారు..
అయితే అసలు సమస్య రవీంద్ర జడేజా ఫామ్‌తోనే... కొన్నేళ్లుగా టీమిండియాకి త్రీ ఫార్మాట్ ఆల్‌రౌండర్‌గా సెటిల్ అయ్యాడు రవీంద్ర జడేజా. టెస్టుల్లో అదరగొడుతున్న జడ్డూ, టీ20ల్లోనూ బాగానే ఆడుతున్నాడు. అయితే వన్డేల్లో మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు..
ఈ ఏడాది వన్డేల్లో 12 ఇన్నింగ్స్‌ల్లో 27 యావరేజీతో 189 పరుగులు మాత్రమే చేశాడు రవీంద్ర జడేజా. వన్డేల్లో 14 నెలలుగా ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు జడ్డూ. రాజ్‌కోట్‌లో జరిగిన వన్డేలో జడ్డూ కొట్టిన సిక్సర్ మాత్రమే ఈ ఏడాది వచ్చింది...
ఐపీఎల్‌లో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. 2023 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో జడ్డూ ఆఖరి ఓవర్ ఆఖరి 2 బంతుల్లో 6, 4 బాది మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. అలాంటిది జడ్డూ, స్వదేశంలో వన్డే హాఫ్ సెంచరీ కొట్టి 10 ఏళ్లు దాటిపోయింది.. చివరిగా 2013లో స్వదేశంలో హాఫ్ సెంచరీ బాదిన రవీంద్ర జడేజా.. ఆ తర్వాత 50+ మార్కు అందుకోలేకపోతున్నాడు..
Virat Kohli Ravindra Jadeja
2020లో ఆస్ట్రేలియాలో, 2021లో సౌతాఫ్రికాలో రెండు వన్డే హాఫ్ సెంచరీలు బాదినా, స్వదేశంలో మాత్రం ఆ మార్కు అందుకోలేకపోయాడు. 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఫామ్, టీమిండియాని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది..
కనీసం అక్షర్ పటేల్ అయినా ఆకట్టుకుంటాడని అనుకుంటే, అతను గత ఏడాదిగా సరైన ఫామ్‌లో లేడు. 2021-22లో స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఉన్న అక్షర్ పటేల్, ఇప్పుడు వికెట్లు తీయడానికి, పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు..