MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ట్విటర్ ‌లో మళ్లీ రచ్చ చేస్తున్న రవీంద్ర జడేజా - సంజయ్ మంజ్రేకర్.. ఈసారి చర్చ దేని గురించంటే..!

ట్విటర్ ‌లో మళ్లీ రచ్చ చేస్తున్న రవీంద్ర జడేజా - సంజయ్ మంజ్రేకర్.. ఈసారి చర్చ దేని గురించంటే..!

Ravindra Jadeja - Sanjay Manjrekar: భారత జట్టు మాజీ ఆటగాడు, ప్రస్తుతం కామేంటేటర్ గా విధులు నిర్వర్తిస్తునన సంజయ్ మంజ్రేకర్, టీమిండియా స్టార్ ఆల్ రౌండర్  రవీంద్ర జడేజా ల మధ్య ట్విటర్ వార్ ఇప్పటిది కాదు. 2019 నుంచి ఇది కొనసాగుతూనే ఉంది.  

2 Min read
Author : Srinivas M
Published : Sep 30 2022, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రవీంద్ర జడేజా - సంజయ్ మంజ్రేకర్ లు మరోసారి ట్విటర్ లో ట్రెండింగ్ లోకి వచ్చారు. 2019 నుంచి ప్రతీసారి మంజ్రేకర్.. జడేజాను గిల్లడం దానికి జడ్డూ కూడా కౌంటర్ ఇవ్వడం  జరుగుతూనే ఉంది. తాజాగా వీళ్లిద్దరూ మళ్లీ  ట్విటర్ లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.

27

2019 వన్డే ప్రపంచకప్ లో  జడేజాను ఉద్దేశిస్తూ మంజ్రేకర్.. ‘బిట్ అండ్ పీస్ ప్లేయర్’అని చేసిన కామెంట్స్ అప్పట్లో వివాదాస్పదమైంది.  ఆ సందర్భంగా మంజ్రేకర్.. ‘నేను జడేజాకు ఫ్యాన్ ను కాదు. అతడొక బిట్ అండ్ పీసెస్ ప్లేయర్. టెస్టులలో ఓకే గానీ పరిమిత ఓవర్ల క్రికెట్  లో అతడు విఫలమవుతున్నాడు..’ అని  మంజ్రేకర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 
 

37

దీంతో చిర్రెత్తుకొచ్చిన జడేజా.. ‘ఇండియా తరఫున నేను నీకంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడాను. ఇప్పటికీ ఆడుతున్నా.  ఆటగాళ్లు  తమ కెరీర్ లో సాధించినదానికి గౌరవం ఇవ్వడం నేర్చుకో.  నీ నోటిదూల గురించి నేను చాలానే విన్నా..’ అని కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరూ ఆ తర్వాత కూడా గిల్లుకోవడం, ట్విటర్ లో వాదులాడుకోవడం చూశాం. 

47

అయితే ఇటీవలి కాలంలో ఈ ఇద్దరి మధ్య  విభేదాలకు ఫుల్ స్టాప్ పడ్డట్టే కనిపిస్తున్నది.  ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్బంగా  జడేజాను ఇంటర్వ్యూ చేసే క్రమంలో మంజ్రేకర్ ముందు.. ‘జడేజా నావి రెండు ప్రశ్నలు.  అదేంటంటే నాతో మాట్లాడటం నీకు ఓకేనా..?’ అని ఫన్నీగా ప్రశ్నించాడు.  దానికి  జడ్డూ నవ్వుతూ.. ‘ఓకే’ అని రిప్లై ఇచ్చి సంభాషణను కంటిన్యూ చేశాడు. 

57

ఇక తాజాగా మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని  విశ్రాంతి తీసుకుంటున్న జడ్డూ.. ట్విటర్ లో మంజ్రేకర్ కు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశాడు. లెజెండ్స్ లీగ్ లో భాగంగా కామెంటరీ నిర్వహిస్తున్న మంజ్రేకర్ ఫోటో పెట్టి.. ‘నా ప్రియమైన మిత్రుడిని  టీవీలో చూస్తున్నా..’ అని ఓ ట్వీట్ పెట్టాడు. 

67

జడ్డూ ఈ ట్వీట్ పెట్టిన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో  ఈ ట్వీట్ వైరల్ గా మారింది.  ఆసియా కప్ తర్వాత ఈ ఇద్దరి మధ్య విభేదాలు  సమిసిపోయాయని, అందుకే జడ్డూ ఈ ట్వీట్ చేశాడని అంతా అనుకున్నారు. 

77

ఇదిలాఉండగా  ఈ ట్వీట్ చూసిన మంజ్రేకర్..  ‘హ హ హ.. నువ్వు మళ్లీ ఫీల్డ్ లో దిగే సమయం కోసం నీ డీయర్ ఫ్రెండ్ ఎదురుచూస్తున్నాడు..’ అని  బదులిచ్చాడు. దీంతో అభిమానులు ఇక వీళ్లిద్దరి మధ్య  గొడవల్లేవని, కలిసిపోయినట్టే అని ఖాయం చేసుకున్నారు.

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
'టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించి.. కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఆడుతున్నాడు..' : మాజీ క్రికెటర్
Recommended image2
టీ20 వరల్డ్ కప్ కు ముందే టీమిండియాకు బిగ్ షాక్ .. హాస్పిటల్ పాలైన హైదరబాదీ క్రికెటర్, ఇతడి స్థానంలో ఆడేదెవరు?
Recommended image3
కివీస్‌తో సిరీస్.. ఇకపై ఆ ఇద్దరి ప్లేయర్స్‌ వన్డేలకు టాటా చెప్పేసినట్టే.. ఎవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved