4 టీమ్స్, 9 ఫైనల్స్, అందులో 7 సార్లు ఓటమి... అశ్విన్‌ది మామూలు గుండె కాదయ్యా...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు రవిచంద్రన్ అశ్విన్. మెగా వేలంలో రూ.5 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్, మనోడిని పూర్తిగా వాడేసింది. 14 సీజన్ల తర్వాత ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్, టైటిల్ ఫైట్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది... అయితే అశ్విన్‌కి ఇది మొదటిసారి. ఇప్పటిదాకా 7 సార్లు ఫైనల్ మ్యాచుల్లో ఓడిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్...

Ravichandran Ashwin
ఐపీఎల్ 2022 సీజన్‌లో 17 మ్యాచులు ఆడి 7.51 ఎకానమీతో 12 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఓ హాఫ్ సెంచరీతో 141.48 స్ట్రైయిక్ రేటుతో 191 పరుగులు చేసి రాణించాడు...
ఐపీఎల్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన జట్టులో సభ్యుడిగా ఉండడం ఇది ఏడోసారి. 2008లో చెన్నై సూపర్ కింగ్స్‌లో ఐపీఎల్ కెరీర్ ఆరంభించిన అశ్విన్, ఆ తర్వాత రైజింగ్ పూణే సూపర్ జెయింట్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల తరుపున ఆడాడు...
15 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న అతి కొద్ది మంది ప్లేయర్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్, 2022 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రిటైర్ అవుట్‌గా పెవిలియన్ చేరి, ఐపీఎల్‌లో టీ20 ఫార్మాట్‌లోనే ఈ ఫీట్ సాధించిన మొదటి ప్లేయర్‌గా చరిత్రలో స్థానం సంపాదించుకున్నాడు...
2008లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఫైనల్‌లో ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 2012, 2013, 2015 సీజన్లలో రన్నరప్‌గా ముగించిన చెన్నై టీమ్‌లో ప్లేయర్‌గా ఉన్నాడు...
R Ashwin
చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 2010, 2011 సీజన్లలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన రవిచంద్రన్ అశ్విన్, 2009 సీజన్లలో ప్లేఆఫ్స్‌కి చేరాడు. 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫైనల్ చేరి, ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడింది...
ఆ సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరుపున ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 2020 సీజన్‌లో మొట్టమొదటి సారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌లో మెంబర్‌గా ఉన్నాడు.....
2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌లోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, టీమ్‌ని ఫైనల్ చేర్చినా రెండో టైటిల్ అందించలేకపోయాడు... ఓవరాల్‌గా 15 సీజన్లలో అశ్విన్, రెండు సార్లు టైటిల్ గెలవగా, 7 సార్లు ఫైనల్ మ్యాచుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు...
2019 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గానూ వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్, ఆ ఒక్క టీమ్‌ని ఫైనల్ చేర్చలేకపోయాడు. మొత్తానికి అశ్విన్, ఇన్నిసార్లు ఫైనల్ ఆడడంతో లక్కీ ప్లేయర్ ఆ.. లేక ఎక్కువసార్లు ఫైనల్‌లో ఓడడంతో అన్‌లక్కీ ప్లేయర్ ఆ... చెప్పలేకపోతున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...