అతని కన్నింగ్ యాటిట్యూడ్, టీమిండియాకి చాలా ముఖ్యం.. రవిచంద్రన్ అశ్విన్‌పై సునీల్ గవాస్కర్ కామెంట్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్, తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా? దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు స్పిన్నర్లు టీమ్‌లో ఉండడంతో అశ్విన్, చాలా మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సిందే..
Ravichandran Ashwin
ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆసీస్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై అశ్విన్‌కి అదిరిపోయే రికార్డు ఉంది. ఆస్ట్రేలియాతో ఇండోర్‌లో రెండో వన్డేలో అశ్విన్ 3 వికెట్లు తీశాడు..
‘మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలతో పవర్ ప్లేలో బౌలింగ్ చేయించాలి. రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రిత్ బుమ్రా ప్రారంభంలో భారీగా పరుగులు ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇదే కొనసాగించే అవకాశం కూడా ఉంది..
అయితే మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసేందుకు రవిచంద్రన్ అశ్విన్ అనుభవం, అతని కన్నింగ్ యాటిట్యూడ్ సరిపోతాయి. ఆసీస్ వంటి జిత్తులమారి టీమ్‌పై వికెట్లు తీసేందుకు అశ్విన్ లాంటి బౌలర్ చాలా కీలకం..
అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందని కచ్ఛితంగా చెప్పలేను. అయితే ఆస్ట్రేలియా టీమ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వారిని తక్కువ స్కోరుకి నియంత్రించాలంటే మాత్రం అశ్విన్‌ని ఆడించి తీరాలి..
Ravichandran Ashwin
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో అశ్విన్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి చాలా పెద్ద తప్పు చేశారు. ఈసారి ఆ తప్పు చేయరని అనుకుంటున్నా.
India Vs Australia
చెన్నైలో మ్యాచ్ కాబట్టి అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగినా తప్పు లేదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..