అశ్విన్ ఆ స్థాయికి రావాలంటే ఇది సరిపోదు! టీమిండియా స్పిన్నర్‌పై ఏబీ డివిల్లియర్స్ కామెంట్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆడలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్, వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 12 వికెట్లు తీసి 700 అంతర్జాతీయ వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఉన్న అశ్విన్, మరో 15 వికెట్లు తీస్తే టెస్టుల్లో 500 వికెట్లు పూర్తి చేసుకుంటాడు..
Ravichandran Ashwin
‘రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ప్లేయర్. అతను ఒకటి రెండు సీజన్లలో బాగా ఆడడం కాదు. ప్రతీసారి 100కి 120 శాతం ఇస్తాడు. నేను చాలాసార్లు అతని బౌలింగ్ ఆడాను. ప్రతీసారీ నన్ను సర్‌ప్రైజ్ చేశాడు. అంతకంటే ఇంప్రెస్ చేశాడు..
Ravichandran Ashwin
రైట్ హ్యాండ్ బ్యాటర్లు అయినా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అయినా అశ్విన్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడాల్సిందే. కొందరికి అతను ఇప్పటికే G.O.A.T (Greatest of All Time). కాని అందరికీ GOAT కావాలంటే మాత్రం ఇంకొన్ని వికెట్లు తీసేదాకా ఆగాల్సిందే...
అశ్విన్ పర్ఫెక్ట్ మ్యాచ్ విన్నర్. అందులో సందేహం లేదు. అయితే లెజెండ్స్ లిస్టులో చేరాలంటే అశ్విన్‌కి ఇంకొంత సమయం పడుతుంది..
యశస్వి జైస్వాల్‌ని నేను ఐపీఎల్ నుంచే చూస్తున్నా. తొలి టెస్టులో అతను ఆడిన ఇన్నింగ్స్ అసాధారణమైనది. ఎంతో ఓపిక చూపిస్తూ మూడు రోజులు బ్యాటింగ్ చేశాడు. అతనిలో ఏదో స్పెషాలిటీ ఉంది..
అతని పొడవు కూడా తనకి బాగా సాయం అవుతోంది. చాలా టాలెంటెడ్ యంగ్‌స్టర్. టీమిండియా ఫ్యూచర్. తొలి మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించడం చాలా సంతోషాన్నిచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్..