- Home
- Sports
- Cricket
- కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసిన రవిచంద్రన్ అశ్విన్... అనిల్ కుంబ్లే తర్వాతి ప్లేస్‌లో...
కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసిన రవిచంద్రన్ అశ్విన్... అనిల్ కుంబ్లే తర్వాతి ప్లేస్‌లో...
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు, పర్యాటక జట్టును ఓ ఆటాడుకుంటోంది. స్వదేశీ పిచ్ కండీషన్‌ను చక్కగా వాడుకుంటూ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకను 174 పరుగులకి ఆలౌట్ చేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లోనూ వరుస వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టగలిగింది...

భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 175 పరుగులు చేసి అజేయంగా నిలిస్తే, శ్రీలంక జట్టు మొత్తం కలిసి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది...
పథుమ్ నిశ్శంక ఒక్కడు 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ఒంటరి పోరాటం చేయగా కెప్టెన్ కరుణరత్నే 28, అసలంక 29, ఏంజెలో మాథ్యూస్ 22 పరుగులు చేశారు...
లంక బ్యాటింగ్ ఆర్డర్‌లో చివరి నాలుగు వికెట్లు కూడా డకౌట్ కావడం విశేషం. లక్మల్, ఎంబుల్దేనియా, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరారు...
బ్యాటుతో 175 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, బౌలింగ్‌లో 13 ఓవర్లలో 4 మెయిడిన్లతో 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.. అశ్విన్, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కగా, షమీ ఓ వికెట్ తీశాడు...
రెండో ఇన్నింగ్స్‌లో లహిరు తిరుమన్నేని డకౌట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, ఆ తర్వాత పథుమ్ నిశ్శంకను అవుట్ చేసి కపిల్‌దేవ్ అత్యధిక టెస్టు వికెట్ల రికార్డును సమం చేశాడు...
9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసిన చరిత్ అసలంక, అశ్విన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... అసలంక వికెట్‌తో కపిల్‌దేవ్ 434 వికెట్ల రికార్డును అధిగమించిన రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు...
భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ 131 టెస్టుల్లో 434 వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ తన 85వ టెస్టులోనే ఈ రికార్డును బ్రేక్ చేశాడు... అలాగే ఈ ఫీట్‌తో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్ 9లోకి ఎంట్రీ ఇచ్చాడు అశ్విన్...
ముత్తయ్య మురళీధరన్ 800 టెస్టు వికెట్లతో టాప్‌లో ఉండగా, షేన్ వార్న్ 708, జేమ్స్ అండర్స్ 640, అనిల్ కుంబ్లే 619, మెక్‌గ్రాత్ 563, స్టువర్ట్ బ్రాడ్ 537, వాల్స్ 519, డేల్ స్టేయిన్ 439 వికెట్లతో అశ్విన్ కంటే ముందున్నారు...
టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా కుంబ్లే తర్వాతి స్థానంలో నిలిచాడు అశ్విన్.. అనిల్ కుంబ్లే 619 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.