- Home
- Sports
- Cricket
- జస్ప్రిత్ బుమ్రా కంటే ఉమ్రాన్ మాలిక్ బెటర్... ఐపీఎల్ 2023 అయ్యాక! రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు...
జస్ప్రిత్ బుమ్రా కంటే ఉమ్రాన్ మాలిక్ బెటర్... ఐపీఎల్ 2023 అయ్యాక! రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు...
జస్ప్రిత్ బుమ్రా, టీమిండియాకి ఆరేళ్లుగా ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. అయితే గత ఆరు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టుల్లో ఆడతాడని రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. బుమ్రా ఇప్పటికే పూర్తి ఫిట్‌నెస్ సాధించినా అతన్ని మొదటి రెండు టెస్టులకు దూరంగా పెట్టింది టీమిండియా...

Jasprit Bumrah
చివరి రెండు టెస్టుల్లో జస్ప్రిత్ బుమ్రాని ఆడించి, ఆ తర్వాత ఐపీఎల్ 2023 సీజన్‌లో మనోడిని ఫుల్లుగా వాడుకోవచ్చని రోహిత్ శర్మ ప్లాన్ వేసి ఉంటాడని మీమ్స్ వైరల్ అవుతున్నాయి... న్యూజిలాండ్‌తో సిరీస్‌లో బుమ్రా ఆడతాడని బీసీసీఐ ప్రకటించాక, మూడు రోజులకు మళ్లీ అతను తప్పుకుంటాడని తేల్చడం ఈ అనుమానాలకు తావిస్తున్నాయి...
Jasprit Bumrah
అంతాబాగానే ఉంది కానీ ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 14 మ్యాచులు ఆడబోతున్న బుమ్రా, అక్కడ గాయపడితే పరిస్థితి ఏంటి?
Image credit: Getty
ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత గాయపడిన జస్ప్రిత్ బుమ్రా, ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు. ఆ తర్వాత రెండు మ్యాచులు ఆడి మళ్లీ గాయం తిరగబెట్టడంతో టీ20 వరల్డ్ కప్ టోర్నీకి కూడా దూరమయ్యాడు...
Image credit: PTI
150 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేస్తూ టీమిండియాని, సెలక్టర్లను ఇంప్రెస్ చేసిన జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడతాడా? టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఉమ్రాన్ మాలిక్‌ని ఆడించాలని క్రికెట్ విశ్లేషకులు సూచించినా, బీసీసీఐ, సెలక్టర్లు పట్టించుకోలేదు..
‘ఉమ్రాన్ మాలిక్ టీ20ల్లో కంటే వన్డేల్లో కరెక్టుగా సెట్ అవుతాడు. ఇప్పుడు గాయాల కారణంగా సీనియర్లు, టీమ్‌కి దూరమవుతుండడం ఉమ్రాన్ మాలిక్‌కి బాగా కలిసొచ్చే విషయం. వరల్డ్ కప్‌కి జట్టుని అనౌన్స్ చేయడానికి డెడ్‌లైన్ త్వరలో ప్రకటిస్తారు. అప్పుడు ప్లేయర్ల ఫిట్‌నెస్ కీలకంగా మారుతుంది..
Image credit: Getty
అందుకే ఈ ఐపీఎల్ 2023 సీజన్ ప్లేయర్లకు చాలా ముఖ్యం. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించి, టీమిండియాలోకి వస్తే మంచిదే. ఎందుకంటే అతను స్టార్ ప్లేయర్. మహ్మద్ షమీ కూడా వన్డేల్లో భారత జట్టుకి కీలక ప్లేయర్.
అయితే ఈ ఇద్దరిలో ఎవరైనా ఐపీఎల్‌లో గాయపడితే... ఉమ్రాన్ మాలిక్‌ని వన్డే వరల్డ్ కప్ ఆడకుండా ఎవ్వరూ ఆపలేరు.. అర్ష్‌దీప్ సింగ్ కూడా బాగా ఆడుతున్నాడు, కానీ వన్డేల్లో ఉమ్రాన్ మ్యాచ్ విన్నర్... అందుకే ఛాన్స్ ఎక్కువ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..