MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రోహిత్.. రషీద్‌తో జాగ్రత్త.. మ్యాచ్‌ను ఎప్పుడైనా మలుపు తిప్పగలడు.. ముంబైకి భజ్జీ హెచ్చరిక

రోహిత్.. రషీద్‌తో జాగ్రత్త.. మ్యాచ్‌ను ఎప్పుడైనా మలుపు తిప్పగలడు.. ముంబైకి భజ్జీ హెచ్చరిక

IPL 2023 Playoffs: ఐపీఎల్ - 16 లో నేడు ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్ ను ఢీకొనబోతున్నది.  ఈ మ్యాచ్ కు ముందు హర్బజన్ సింగ్.. రోహిత్  సేనకు ముందస్తు హెచ్చరిక చేశాడు. 

2 Min read
Author : Srinivas M
Published : May 26 2023, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇండియన్ ప్రీమియర్ లీగ్  - 2023 ఎడిషన్ లో   శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య  రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందే  రోహిత్ శర్మ అండ్ కో. కు  ముంబై మాజీ  సారథి హర్భజన్ సింగ్ ముందస్తు వార్నింగ్ ఇచ్చాడు.  గుజరాత్ ఆటగాడు రషీద్  ఖాన్ తో జాగ్రత్తగా ఉండాలని  భజ్జీ సూచించాడు. 

26

హర్భజన్ మాట్లాడుతూ.. ‘రషీద్ ఖాన్  ప్రత్యేకమైన ఆటగాడు.  బౌలింగ్ లో వికెట్లు తీయగలడు. ఆఖర్లో బ్యాటింగ్ కు వచ్చి పరుగులు చేయగలడు. ఫీల్డింగ్ లో కూడా అతడికి తిరుగులేదు. ఈ సీజన్ లో కొన్ని కళ్లు చెదిరే క్యాచ్ లు కూడా అందుకున్నాడు. 

36

హార్ధిక్ పాండ్యా అందుబాటులో లేనప్పుడు  అతడే గుజరాత్  సారథ్య పగ్గాలు  కూడా చేతపట్టాడు.  అతడు ఆల్ రౌండర్.  గుజరాత్ టైటాన్స్ కు అలాంటి ప్లేయర్ ఉండటం   ఎంతో అదృష్టం.  అతడితో చాలా జాగ్రత్తగా ఉండాలి..’అని  అన్నాడు. 

46
Image credit: PTI

Image credit: PTI

మహ్మద్ షమీ గురించి మాట్లాడుతూ.. ‘ఇటువంటి బౌలర్ మాకు కూడా ఉండాలనుకునే బౌలర్ షమీ.  కొత్త బంతితో షమీ చెలరేగుతున్నాడు.  డెత్ ఓవర్లలో యార్కర్లతో  చెలరేగుతాడు. టీమ్ కు ఎప్పుడు అవసరం వచ్చినా వికెట్ తీయడానికి ముందుంటాడు.  సీమ్ పొజిషనల్ లో షమీకి తిరుగులేదు.  అతడు స్వింగ్ వేస్తే ఎంతటి బ్యాటర్ కు అయినా తిప్పలు తప్పవు...’అని కొనియాడాడు. 

56

ఇక ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ యువ ఆటగాళ్ల కెప్టెన్ అని.. అతడు విజయాలను తలకు ఎక్కించుకోని గొప్ప సారథి అని కొనియాడాడు. ‘రోహిత్ చాలా కూల్ కెప్టెన్.  టీమ్ లో ఎవరైనా యంగ్ స్టార్స్ తమకు ఏ సందేహం వచ్చినా  రోహిత్ ను వెళ్లి అడగొచ్చు. హిట్‌మ్యాన్ వారికి ఆ  స్పేస్ ఇస్తాడు.  

66

ఈ బచ్చాగాళ్లకు మనం చెప్పేది ఏంటి అన్న ఈగో అతడిలో కనిపించదు. అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ తో రోహిత్ ఎక్కువ సమయం గడుపుతాడు.    అన్నింటికంటే మించింది అతడెప్పుడూ సక్సెస్ ను తలలోకి ఎక్కించుకోడు.. విజయాలకు పొంగిపోడు. జట్టులోని సీనియర్ ప్లేయర్స్ కు చాలా మర్యాదనిస్తాడు. రోహిత్ గొప్ప ప్లేయర్...’ అని   భజ్జీ అన్నాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL నుండి రోహిత్ శర్మ ఔట్...? ఆ గాయం అంత సీరియసా..?
Recommended image2
IPL 2026 : వరుస ఓటములు.. ముంబై ఇండియన్స్‌కు ఏమైంది? అసలు కారణాలివే
Recommended image3
IPL చరిత్రలో మొదటి బంతి ఆడింది, వేసింది, క్యాచ్ పట్టింది, సెంచరీ చేసింది ఎవరు..? పాకిస్థానీ క్రికెటర్ పేరిట అద్భుత రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved