Ranji Trophy 2024: రంజీలో దేవదత్ పడిక్కల్ ధనాధన్ ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీ మిస్.. !
Ranji Trophy 2024: దేశవాళీ క్రికెట్ లో దేవదత్ పడిక్కల్ ధనాధన్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా కర్నాటక-పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 193 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు.
Devdutt Padikkal
Ranji Trophy 2024 - Devdutt Padikkal: దేశవాళీ క్రికెట్ లో దేవదత్ పడిక్కల్ తన ధనాధన్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా కర్నాటక-పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టిన దేవదత్ పడిక్కల్.. ఏడు పరుగులు దూరంలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను 193 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 2024 రంజీ ట్రోఫీలో భాగంగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో దేవదత్ పడిక్కల్ కర్ణాటక తరఫున ఆడాడు.
Devdutt Padikkal
23 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ తన కెరీర్ బెస్ట్ స్కోర్ నమోదు చేస్తూ తన మూడో ఫస్ట్ క్లాస్ సెంచరీని నమోదు చేశాడు. అద్భుతమైన విజయ్ హజారే ట్రోఫీ తర్వాత రంజీ ట్రోఫీలోనూ అదే ఫామ్ ను దేవదత్ పడిక్కల్ కొనసాగించాడు. 24 బౌండరీలు, 4 సిక్సర్లతో 193 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. అతను ఔటయ్యే సమయానికి కర్ణాటక స్కోరు 344/4 గా ఉంది.
Devdutt Padikkal
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ డకౌట్ కావడంతో దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు. పరిస్థితిని అర్థం చేసుకుని తనను తాను అన్వయించుకున్నాడు. రవికుమార్ సమర్థ్ తో కలిసి 76 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆ తర్వాత అనుభవజ్ఞుడైన మనీష్ పాండేతో కలిసి 234 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి కర్ణాటకను 340 పరుగుల మార్కును దాటించారు. ఇక డబుల్ సెంచరీ చేస్తాడనుకునే సమయంలోనే పడిక్కల్ ను ప్రేమిత్ దత్తా ఔట్ చేశాడు.
Devdutt Padikkal
ఈ సుడిగాలి ఇన్నింగ్స్ తో దేవదత్ పడిక్కల్ ఫస్ట్ క్లాస్ లో 1,500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 26 మ్యాచుల్లో 36 కంటే ఎక్కువ సగటుతో 1,673 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో పడిక్కల్ మూడు సెంచరీలతో పాటు 11 అర్ధసెంచరీలు సాధించాడు. 2018లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసిన అతను క్రమంగా టాప్ ఆర్డర్ లో కర్ణాటకకు ప్రధాన ఆటగాడిగా మారాడు. 2021లో శ్రీలంకతో జరిగిన రెండు టీ20ల్లో పడిక్కల్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
Devdutt Padikkal
2023 విజయ్ హజారే ట్రోఫీలో కూడా దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 2023 విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడిన పడిక్కల్ కేవలం ఐదు మ్యాచ్ లలో 155 సగటు, 120.46 స్ట్రైక్ రేటుతో 465 పరుగులు చేశాడు. మొత్తం ఐదు మ్యాచుల్లో 50కి పైగా స్కోర్లు చేసిన యంగ్ ప్లేయర్ రెండు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు సాధించాడు.