రాజస్థాన్ రాయల్స్ నుంచి స్టీవ్ స్మిత్ అవుట్... సంజూ శాంసన్‌కి కెప్టెన్సీ...

First Published Jan 12, 2021, 1:28 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు రాజస్థాన్ రాయల్స్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి సారథ్యం వహించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను వేలానికి వదిలేయాలని నిర్ణయించుకుందట ఆర్ఆర్. ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల ప్రదర్శన అంతంత మాత్రమే. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 2020 సీజన్‌లో ఇచ్చిన అట్టర్ ఫ్లాప్ షో... ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్‌లో చూపించిన సూపర్ షో తర్వాత ఈ విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది. అందుకే 2021 సీజన్ ఆరంభానికి ముందే జట్టులో కీలక మార్పులకు సిద్ధమవుతోంది రాజస్థాన్ రాయల్స్...

2019 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి అజింకా రహానే కెప్టెన్సీ వహించాడు.

అయితే అతని సారథ్యంతో సంతృప్తి చెందని ఆర్ఆర్, ఆస్ట్రేలియా క్రికెటర్ అనే మోజుతో స్టీవ్ స్మిత్‌కి కెప్టెన్సీ అందించింది.

అయితే ఐపీఎల్‌ చరిత్రలోనే ఎప్పుడూ లేనట్టుగా అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన రాజస్థాన్ రాయల్స్, తొలిసారిగా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

2014 నుంచి రాజస్థాన్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న స్టీవ్ స్మిత్... 2018లో రీఎంట్రీ సమయంలో ఆర్ఆర్ ఉంచుకున్న ఏకైక ప్లేయర్.

రెండేళ్ల నిషేధం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్... పాత జట్టులోని స్టీవ్ స్మిత్‌ను మాత్రమే ఉంచుకుని, మిగిలిన ప్లేయర్లను వేలానికి వదిలేసింది.

2020 సీజన్‌లో 14 మ్యాచుల్లో 311 పరుగులు మాత్రమే చేసిన స్టీవ్ స్మిత్‌ కంటే యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ మెరుగ్గా పరుగులు చేశాడు.

దాంతో సంజూ శాంసన్‌కి కెప్టెన్సీ ఇవ్వాలని భావిస్తోందట రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం... స్మిత్‌పైన పెరుగుతున్న నెగిటివిటీ కూడా దీనికి కారణమని టాక్.

ఐపీఎల్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన స్టీవ్ స్మిత్, ఆ తర్వాత టీమిండియాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లో 62 బంతుల్లోనే సెంచరీలు చేసి అదరగొట్టాడు...

ఈ ప్రదర్శన కారణంగా ఐపీఎల్‌లో స్మిత్, మ్యాక్స్‌వెల్ లాంటి కొందరు ఆసీస్ ప్లేయర్లు, పూర్తి మనసు పెట్టి ఆడడం లేదని, కేవలం డబ్బుల కోసం ఆడుతున్నారని అభిప్రాయం వ్యక్తమయ్యాయి.

అందుకే ఆసీస్ మాజీ కెప్టెన్ కంటే భారత భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న సంజూ శాంసన్‌కి నాయకత్వం ఇవ్వడం సరైందని ఆర్ఆర్ ఆలోచన చేస్తోంది.

ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కూడా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. గత సీజన్‌ మధ్యలోనే బట్లర్‌కి కెప్టెన్సీ ఇస్తారని ప్రచారం జరిగింది...

అతనితో పాటు రాజస్థాన్ రాయల్స్‌లో టాప్ ప్లేయర్‌గా ఉన్న ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కి కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉందని కూడా టాక్...

స్టీవ్ స్మిత్‌ని వేలంలోకి వదిలేస్తే... అతన్ని తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. స్మిత్‌కి, సీఎస్‌కే జట్టుకి సరిగ్గా సరిపోతుందని అప్పుడే సోషల్ మీడియాలో జోరుగా చర్చలు కూడా మొదలయ్యాయి.

గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిస్తే, చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారిగా ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?