పృథ్వీషా పూర్ పర్ఫామెన్స్... ఇతనేనా ఫ్యూచర్ సచిన్, సెహ్వాగ్ అయ్యేది?...

First Published Dec 12, 2020, 3:06 PM IST

పృథ్వీ షా... అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఓ సంచలనంలా దూసుకొచ్చిన యంగ్ క్రికెటర్. అయితే గత ఏడాదిగా పృథ్వీషా అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. ఫ్యూచర్ సచిన్ టెండూల్కర్‌గా, భవిష్యత్తు సెహ్వాగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షా... పూర్ పర్ఫామెన్స్‌తో క్రికెట్ కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకుంటున్నాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో, ఆసీస్ టూర్ ప్రాక్టీస్ మ్యాచుల్లో పృథ్వీషా ప్రదర్శనపై విమర్శల వర్షం కురుస్తోంది...

ఐదేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన పృథ్వీషా... క్రికెట్‌ మీద ఇష్టంతో 8ఏళ్ల వయసులోనే స్కూల్ కూడా మారాడు..

స్కూల్ క్రికెట్‌లో 546 పరుగులు బాదిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన పృథ్వీషా... ముంబై అండర్16 టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహారించాడు...

రంజీ ట్రోఫీలో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన ముంబై బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన పృథ్వీషా... సచిన్ రికార్డును సమం చేశాడు.

అండర్ 19 వరల్డ్‌కప్‌లో టీమిండియాకి సారథ్యం వహించిన పృథ్వీషా... 2018లో నాలుగో అండర్ 19 టైటిల్ అందించాడు.

ఆడిన మొదటి ఐపీఎల్‌లో 153 స్టైయిక్ రేటుతో 245 పరుగులు చేసిన పృథ్వీషా... ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు.

ఇంగ్లాండ్ టూర్‌లో ఇండియా ఏ తరుపున ఆడిన పృథ్వీషా... 603 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాయి. అతని సగటు 60కి పైనే...

దేశవాళీ ప్రదర్శన ఆధారంగా ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన పృథ్వీషా... 2018 మెన్స్ క్రికెట్‌లో సంచలన యువ స్టార్‌గా ఐసీసీ గుర్తింపు పొందాడు.

మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన పృథ్వీషా... టెండూల్కర్ తర్వాత అతి పిన్న వయసులో శతకం బాదిన భారత క్రికెటర్‌గా నిలిచాడు...

అయితే గత ఏడాది కాలంగా పృథ్వీషా...  పూర్ పర్ఫామెన్స్‌ కొనసాగుతోంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వని పృథ్వీషా, ఆ తర్వాత ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ ఫెయిల్ అవుతున్నాడు.

మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులు మాత్రమే చేశాడు...

రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా పృథ్వీషా ఫెయిల్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో తన స్టైల్‌లో 29 బంతుల్లో 8 ఫోర్లతో 40 పరుగులు చేసిన పృథ్వీషా... విల్ సుథర్‌లాండ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో 3 పరుగులకే పృథ్వీ షా అవుట్ కావడంతో... ఈ యంగ్ బ్యాట్స్‌మెన్‌పై ట్రోలింగ్ మొదలైంది...

పృథ్వీషా ఇంకా అనుభవం అవసరం అని... అతన్ని రంజీ ట్రోఫీల్లో ఆడించి, తన టెంపర్‌మెంట్ ఫిక్స్ చేసుకోవాలని కామెంట్ చేస్తున్నారు అభిమానులు...

బ్యాటింగ్ స్టైల్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌లా, టెక్నిక్‌లో టెండూల్కర్‌లా అనిపించే పృథ్వీషా... అంతర్జాతీయ ఆటగాడిగా రాణించాలంటే ఇంకాస్త మెచ్యూరిటీ అవసరమని సూచిస్తున్నారు అభిమానులు.

అయితే ఐపీఎల్, ప్రాక్టీస్ మ్యాచుల్లో ఎలా ఉన్నా పృథ్వీషాను ఆసీస్ టూర్‌లో టెస్టు మ్యాచుల్లో ఆడించాలని అంటున్నారు మరికొందరు. మూడు టెస్టుల్లో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేసిన పృథ్వీషా.. భారత జట్టుకు ఆడినప్పుడు రాణిస్తాడని అంటున్నారు. మరి మయాంక్ అగర్వాల్ కూడా రాణిస్తుండడంలో పృథ్వీషాకు టెస్టు సిరీస్‌లో చోటు దక్కుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?