ధోనీ కెప్టెన్సీలో ఆడాలనేది ప్రతీ క్రికెటర్ కల... మొయిన్ ఆలీ కామెంట్...
మహేంద్ర సింగ్ ధోనీ... భారత జట్టుకి రెండు వరల్డ్‌కప్స్ అందించిన కెప్టెన్. ధోనీ నాయకత్వంలో భారత జట్టు అద్భుతాలు చేసింది. ఒత్తిడి సమయాల్లోనూ ఎంతో ప్రశాంతంగా, ఎంతో కామ్ యాటిట్యూడ్‌తో ఉండే ‘కెప్టెన్ కూల్’గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ కూడా ధోనీ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు...

గత కొన్ని సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సభ్యుడిగా ఉన్న మొయిన్ ఆలీని, ఐపీఎల్ 2021 వేలానికి వదిలేసింది ఆర్‌సీబీ...

ఐపీఎల్ 2021 మినీ వేలంలో మొయిన్ ఆలీని ఏకంగా రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. వేలానికి ముందు జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొయిన్ ఆలీ ఆడిన సునామీ ఇన్నింగ్స్ కూడా ఈ భారీ ధరకు కారణమైంది...

ఐపీఎల్ మినీ వేలానికి ముందు జరిగిన రెండో టెస్టులో హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ.

‘ధోనీ కెప్టెన్సీలో ఆడిన చాలామంది ప్లేయర్లతో నేను మాట్లాడాను. మాహీతో కలిసి ఆడిన తర్వాత వారి ఆటతీరు, ఆలోచనావిధానం చాలా మెరుగయ్యాయని వాళ్లు నాకు చెప్పారు...

తన నాయకత్వంతో ఆటగాళ్లను ప్రభావితం చేయగల గొప్ప కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... వారి ఆటపై వారికి నమ్మకం పెంచి, తమ సత్తా గురించి క్లారిటీ ఇచ్చే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...

ధోనీతో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా... ప్లేయర్ల మీద ఒత్తిడి పడకుండా ఉండాలంటే ప్రశాంతమైన వ్యక్తిత్వం కలిగిన కెప్టెన్, కోచ్‌లు చాలా అవసరం... సీఎస్‌కేకి అది ఓ అదృష్టం...’ అంటూ చెప్పుకొచ్చాడు మొయిన్ ఆలీ...

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన ఆఖరి వన్డేలో 95 పరుగులు చేసి వీరోచిత పోరాటం చేసిన ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ సామ్ కుర్రాన్ ఇన్నింగ్స్ క్రెడిట్ కూడా మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలోకి వెళ్లింది...

గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన సామ్ కుర్రాన్... మహేంద్ర సింగ్ ధోనీ నుంచి చివరిదాకా పోరాడే లక్షణం, ఒత్తిడిలో ఎలా ప్రశాంతంగా ఉండాలో నేర్చుకున్నాడని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా వ్యాఖ్యానించాడు...

గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన మొయిన్ ఆలీ, 2020 సీజన్‌కి ముందు కూడా విరాట్ కోహ్లీ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం...

కోహ్లీ కెప్టెన్సీలో ఈసారి తాము కప్ గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేసిన మొయిన్ ఆలీ, 2020 సీజన్‌లో కేవలం 3 మ్యాచులు మాత్రమే ఆడి ఒకే వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో కేవలం 12 పరుగులే చేశాడు...