6 వరల్డ్ కప్స్ ఆడితే, ఒక్కసారి సెమీస్‌కి వెళ్లారు! మీరా చెప్పేది... పాకిస్తాన్ టీమ్‌ని ఆడుకుంటున్న సెహ్వాగ్..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ కథ ముగిసింది. చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ ఎంత భారీ స్కోరు చేసినా దాన్ని 7 ఓవర్లలోపు ఛేదిస్తేనే పాకిస్తాన్‌కి సెమీస్ ఛాన్సులు ఉంటాయి...
శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ పెను దుమారం రేపింది. ‘పాకిస్తాన్ జిందా‘బాగ్’... మీ జాతకం ఏంటో మీరు ఏ టీమ్‌కి సపోర్ట్ చేసినా వాళ్లు కూడా మీలాగే ఆడతారు..’ అంటూ ట్వీట్లు చేశాడు వీరూ..
Sehwag-Pakistan Team
ఈ ట్వీట్లపై కొందరు భారతీయులు, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా అవమానించడం కరెక్ట్ కాదని ట్వీట్లు చేశారు. దీంతో మరోసారి పాకిస్తాన్‌ని తన స్టైల్‌లో ఆడుకున్నాడు వీరూ..
‘21వ శతాబ్దంలో 6 వన్డే వరల్డ్ కప్ టోర్నీలు జరిగాయి. అందులో భారత జట్టు 2007 వన్డే వరల్డ్ కప్‌లో తప్ప, మిగిలిన 5 ప్రపంచ కప్ టోర్నీల్లో సెమీస్ చేరింది. మరోవైపు పాకిస్తాన్ జట్టు, ఆరింట్లో ఒకే ఒక్క సారి.. 2011లోనే సెమీస్ దాకా వచ్చింది..
మళ్లీ వాళ్లు భారత జట్టు ఆటను చూసి తట్టుకోలేక బాల్ మారుస్తున్నారని, పిచ్ మారుస్తున్నారంటూ తిక్క తిక్క ఆరోపణలు చేస్తున్నారు. గత టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై గెలిచి, ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిన తర్వాత వాళ్ల ప్రధాని కూడా వ్యంగ్యంగా ట్వీట్లు చేశాడు.
ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ల ప్లేయర్లు హైదరాబాద్‌లో టీ ఎంజాయ్ చేస్తున్నామంటూ, భారత సోల్జర్లును ట్రోల్ చేశారు. పీసీబీ చీఫ్ అయితే ఏకంగా భారత్‌ని శత్రుదేశం అంటూ కెమెరా ముందే మాట్లాడాడు..
వాళ్లు చేయాల్సిదంతా చేసి, మేం మంచిగా ఉండాలంటే ఎలా? మర్యాద అనేది ఇచ్చి, పుచ్చుకోవాలి. మీరు మంచిగా ఉంటే, మీతో మేం చాలా మంచిగా ఉంటాం.
తిక్క వేశాలు వేస్తే మా భాషలోనే సమాధానం చెబుతాం. ఆన్ ఫీల్డ్ అయినా ఆఫ్ ఫీల్డ్ అయినా..’ అంటూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్..
2022 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు, ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిన తర్వాత, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో ఓడిన తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, పాక్ క్రికెట్ ఫ్యాన్స్ చేసిన ట్వీట్లను పోస్ట్ చేసిన వీరూ, మా రియాక్షన్ ఇలాగే ఉంటుందని గట్టిగా చెప్పాడు..