క్రికెటర్ భార్య అయితే స్వేచ్ఛ ఉండకూడదా? - ధోనీ భార్య సాక్షి సింగ్...
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్‌కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. మాహీ భార్య అయినప్పటికీ ఏ మాత్రం హద్దులు పెట్టుకోకుండా తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సాక్షి...

2010లో సాక్షి సింగ్‌ను ప్రేమించి, పెళ్లాడాడు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. వీరికి జీవా సింగ్ అనే ఐదేళ్ల కూతురు కూడా ఉంది...
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులు జరిగిన ప్రతీ సారీ స్టాండ్స్‌లో సాక్షి, జీవాల సందడి కనిపిస్తూ ఉంటుంది. మాహీ బ్యాటింగ్ చేస్తుంటే, అరుస్తూ కేకలు వేస్తూ సపోర్ట్ చేస్తుంటుంది సాక్షి...
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే సాక్షి సింగ్, ఓసారి మాహీ తనకు చెప్పులు తొడుగుతున్న ఫోటోలను పంచుకోవడం తీవ్ర దుమారం రేపింది...
ఆ ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలంటూ, ఎమ్మెస్ ధోనీని అవమానించేలా ఫోటోలు పోస్ట్ చేయొద్దంటూ సాక్షిపై కామెంట్లతో విరుచుకుపడ్డారు మాహీ ఫ్యాన్స్...
‘వంద కోట్ల మందిలో 11 మంది మాత్రమే ఆడే జట్టులో ఉన్న క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవడం అదృష్టమే. ముఖ్యంగా క్రికెట్‌ని మతంగా భావించే ఇండియాలో అయితే ఆ ప్రేమను తట్టుకోలేం...
అయితే క్రికెటర్‌ను పెళ్లాడితే మా జీవితం పూర్తిగా మారిపోతుంది. ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చే భర్తను పెళ్లాడితే జీవితంలో పెద్దగా మార్పు ఉండదు. అయితే క్రీడాకారుడిని పెళ్లిడితే మాత్రం... చాలా మార్పులు చూడాల్సి వస్తుంది...
స్వేచ్ఛ ఉండదు. కెమెరాలు వెంటాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితం దొరకదు. కొందరికి కెమెరాలతో ఇబ్బంది ఉండదు. మరికొందరు చాలా ఇబ్బంది పడతారు...
అదీకాకుండా జనాలు, మనం ఎలా ఉండాలో కూడా నిర్ణయించేస్తారు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి ఫోటోలు పోస్టు చేయాలని వాళ్లే నిర్ణయిస్తారు...
అంతేనా స్నేహితులతో కలిసి ఉన్నా, వారితో మాట్లాడుతున్నా అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని చెబుతారు... వాటిని పట్టించుకుంటే స్ట్రెస్ తప్ప, ఏమీ మిగలదు...’ అంటూ కామెంట్ చేసింది సాక్షి సింగ్ ధోనీ...
మార్చి 26న మొదలయ్యే ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఇప్పటికే సూరత్‌లో ప్రాక్టీస్ మొదలెట్టేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...
మాహీతో పాటు ఆయన సతీమణి సాక్షి, కూతురు జీవా సింగ్ కూడా ఈ క్యాంపులో పాల్గొనేందుకు సూరత్ చేరుకున్నారు. సీఎస్‌కే నిర్వహించిన వుమెన్స్ డే కార్యక్రమంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది సాక్షి సింగ్...
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...