MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • అందరూ సచిన్‌లా ఆడలేరు! అందుకే నాకు ఫ్యాన్స్ ఎక్కువ... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్...

అందరూ సచిన్‌లా ఆడలేరు! అందుకే నాకు ఫ్యాన్స్ ఎక్కువ... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్...

దేశంలో క్రికెట్‌కి విపరీతమైన క్రేజ్ రావడానికి సచిన్ టెండూల్కర్ ప్రధాన కారణం. సచిన్ ఆడుతున్నంతసేపు జనజీవనం స్థంభించిపోయేది. ఆ తర్వాత అంతటి పాపులారిటీ తెచ్చుకున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీయే. సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువగానే మాస్ జనాల్లోకి చొచ్చుకుపోయాడు ధోనీ...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 22 2022, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Dhoni Sachin

Dhoni-Sachin

కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీకి దేశవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే ధోనీకే అభిమానులు ఎక్కువ. దీనికి కారణాన్ని స్వయంగా వివరించాడు ధోనీ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

‘జనాలు నా మీద చూపిస్తున్న ఆదరణ, అభిమానం నేనెప్పుడూ ఊహించలేదు. నన్ను మాహీ భాయ్, ఎంఎస్ భాయ్ అని పిలవడం.. నాలో ఏదో ప్రత్యేకత ఉందనే విషయాన్ని గుర్తుచూస్తూ ఉంటుంది. నిజానికి జనాలు నన్ను ఇంత ఇష్టపడడానికి నేను వారిలో ఒకరిగా ఫీల్ అవ్వడమే కారణం...

37

నేను సాధారణ జనం ఆడినట్టే క్రికెట్ ఆడతాను. నా బ్యాటింగ్‌లో టెక్నిక్ ఉండదు, ఏమీ ఉండదు. కళ్లు మూసుకుని షాట్స్ కొట్టినట్టు కొడతానంతే! అదే సచిన్ పాజీ ఆటను చూస్తే, ఎవ్వరైనా ఆయనలా మనం ఆడలేమని అనుకుంటారు...

47
Dhoni Batting

Dhoni Batting

నా బ్యాటింగ్ అలా ఉండదు. నాలా ఎవ్వరైనా ఆడొచ్చు. అందుకే ఇలా నేను కూడా ఆడగలననే జనాలు ఫీల్ అవుతారు.నాలో వారిలో ఒకరిగా మార్చుకుంటారు. నా కెరీర్‌లో నాకు ఎలాంటి నిరాశ లేదు. ఇప్పటిదాకా సాధించిన దాంతో చాలా సంతృప్తితో ఉన్నాడు..

57

ముఖ్యంగా నా కెరీర్‌లో రెండు సందర్భాలు చాలా మధురమైనవి. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో స్టేడియంలోని ప్రేక్షకులంతా కలిసి వందే మాతరం పాడుతుంటే నా ఒళ్లు జలదరించింది. అలాగే 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి వచ్చిన తర్వాత ముంబైలో మాపై జనాలు చూపించిన ప్రేమ... ఆ రెండూ జీవితంలో మరిచిపోలేను...

67
Dhoni

Dhoni

ఈ దేశమే నాకు అతి పెద్ద ఆదర్శం. దేశం తరుపున ఆడడాన్ని నాకు దక్కిన అతి గొప్ప గౌరవంగా భావిస్తా. టీమిండియా ఎప్పుడూ గెలవాలని కోరుకుంటా. చాలామంది నన్ను అదృష్టవంతుడివి అంటుంటారు. నిన్ను కొన్ని కోట్ల మంది అభిమానిస్తారని, నీ ఆట కోసం ఎదురుచూస్తుంటారని చెబుతూ ఉంటారు. అదంతా నేను చాలా ఎంజాయ్ చేస్తా...  ’ అంటూ చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ..

77

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2023 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్సీ చేయబోతున్న ధోనీ, ఈ సీజన్ తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది..

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved